టాలీవుడ్ లో తన కామెడీతోనే కాదు.. కాంట్రవర్సీతో సంచలనాలు సృష్టిస్తున్నారు దర్శకుడు, రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి. ఇప్పటి వరకు 100 పైగా తెలుగు సినిమాలకు రచయితగా పనిచేసాడు.  ప్రస్తుతం నటనపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పోసాని. 2009లో చిలకలూరి పేట నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఎన్నికలలో పోటీ చేసి, ఓటమి పాలయ్యాడు.  ఎలాంటి వ్యక్తినైనా సరే రాజా అంటూ అతణ్ణి సంబోధించే ఒక మేనరిజంతో అందరి మనసు ఆకట్టుకుంటున్నారు పోసాని.  ఆ మద్య ఏపిలో ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ కి మద్దతు ఇస్తూ.. టీడీపీ పాలనను ఎండగట్టారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య సమస్యతో యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.  వైఎస్ జగన్ కి మద్దతు ఇచ్చారని టాలీవుడ్ లో తనపై వ్యతిరేకత వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో సినీ పరిశ్రమలో తనకు ఎవరితో విభేదాలు లేవని.. సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో ప్రారంభించబోతున్నానని అన్నారు.  

 

ఇక తెలుగు బుల్లితెరపై ఏడేళ్లుగా అలరిస్తున్న ‘జబర్ధస్త్’ కామెడీ షో పై ఇటీవల రక రకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే.  అయితే జబర్ధస్త్ ఏడేళ్లుగా జడ్జీగా కొనసాగిన మెగాబ్రదర్ నాగబాబు ఈ షోకి గుడ్ బాయ్ చెప్పారు.  ఆయనతో పాటు మరికొంత మంది నటులు సైతం వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం జబర్ధస్త్ లో నటి, ఎమ్మెల్యే రోజా ఒక్కరే జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  ఆ మద్య కొంత మంది పేర్లు బయటకు వచ్చినా ఇప్పటి వరకు అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు. తాజాగా జబర్ధస్త్ లోకి పోసాని కృష్ణమురళి ఎంట్రీ ఇచ్చారు.  

 

తాజాగా జబర్ధస్త్ ప్రోమోలో ఆయన తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. వెంకీ మంకీస్ టీంలో ఈయన స్కిట్ చేసాడు. జీవన్‌తో పాటు అదిరిపోయే కామెడీ చేసాడు పోసాని. ఈయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్నే తన స్కిట్ కోసం వాడుకున్నారు వెంకీ మంకీస్ టీం. రాజా నీ అప్పు నా అప్పు కాదా.. అంటూ మొదలుపెట్టి నీ గాళ్ ఫ్రెండ్ నా గాళ్ ఫ్రెండ్ కాదా అంటూ ముగించాడు పోసాని.  మొత్తానికి పోసాని రావడం జబర్ధస్త్ కొత్త సందడి మొదలైందంటున్నారు ఆడియన్స్. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: