విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కే ఎస్ రవింద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "వెంకీ మామా". రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు కలిసి నటించిన ఈ చిత్రంపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. చాలా పాత కథని మళ్ళి చెప్పారంటూ విమర్శలు వచ్చాయి. రివ్యూలు ఈ సినిమాకి ఏమంత బాగా రాలేదు.  

 

అందరూ సినిమా గురించి నెగెటివ్‌గానే మాట్లాడుతున్నారు. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ కూడా ఇలాగే ఉంది. వెంకటేష్-నాగచైతన్యల కాంబినేషన్లో సురేష్ ప్రొడక్షన్స్ ఇలాంటి సినిమా తీసిందేమిటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. ఏ ఒక్క రివ్యూ కూడా ఈ సినిమాకి పూర్తి పాజిటివ్ గా చెప్పినట్లు లేదు. అయినా కూడా జనాలు సినిమాకి ఎగబడడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

 

అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. దసరా తర్వాత తెలుగులో ఒక్క పెద్ద సినిమా కూడా విడుదల కాలేదు. సైరా నరసింహారెడ్డి తర్వాత తెలుగులో వచ్చిన పెద్ద సినిమా వెంకీ మామానే. అదీ గాక ఈ సినిమా రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు నటించడంతో ప్రేక్షకులకి ఈ సినిమా పట్ల ఆసక్తి ఎక్కువైంది. మామా అలుళ్ళని దర్శకుడు ఏ విధంగా చూపించి ఉంటాడన్న కుతూహలంతో సినిమా ఎలా ఉన్నా చూడడానికి వస్తున్నారు.

 

అందుకనే ఈ సినిమాకి కలెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయట. ఈ రోజు ప్రధాన సెంటర్లన్నింటిలో హౌస్ ఫుల్ బోర్డులు ప్రత్యక్షమయ్యయంటే సినిమా వసూళ్ళు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి మరో వారం రోజుల వరకు సినిమాలేవీ రిలీజ్ కి లేవు కాబట్టి. వెంకీ మామా బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తున్నట్టే. ఇది ఇలాగే కొనసాగితే వెంకీ మామా బ్లాక్ బస్టర్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: