రియల్ లైఫ్ మామా అల్లుళ్లు రిల్ లైఫ్లో కూడా మామా అల్లుళ్లు గా నటించిన చిత్రం వెంకీ మామ. అక్కినేని వారసుడు నాగచైతన్య దగ్గుబాటి వారసుడు వెంకటేష్ కాంబినేషన్లో  మల్టీ స్టారర్ గా తెరకెక్కిన చిత్రం వెంకీ మామ. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ సినిమా ప్రపోజల్ రాగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూశారు. ఇక ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టించిన ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల అంచనాలను చేరుతుంది. విడుదలైన మొదటి షో నుంచే మంచి టాక్ తో దూసుకుపోతున్నది  వెంకీమామ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

 


 ఇక తొలిరోజే వెంకీ వెంకీ మామ సినిమా టాక్ పరంగానే కాదు కలెక్షన్ల పరంగా కూడా దుమ్ము రేపింది. చాలా చోట్ల ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబట్టింది. నాగచైతన్య వెంకటేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ను తీసుకొచ్చింది వెంకీ మామ సినిమా. ఇక ఈ వసుల్లా  పరంపర దూసుకుపోతుంది. నాగచైతన్య వెంకటేష్ లాంటి  క్రేజీ కాంబినేషన్ కావటం... ఈ సినిమాకి పోటీగా బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా లేకపోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలో ఎలాంటి భూతు లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఫ్యామిలీ మొత్తం వెళ్లి ఈ సినిమా చూస్తు  ఉండడం ఈ సినిమా కలెక్షన్లను మరింత పెంచుతుంది. 

 


 ఇక వెంకీ మామ సినిమా తొలి రోజే తెలుగు రాష్ట్రాల్లో 6.76 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటక రెస్టాఫ్ ఇండియాతో పాటు కూడా యుఎస్  కలుపుకుంటే తొలిరోజే ఈ సినిమాకు 7.40 కోట్లు వచ్చాయి. ప్రతి చోట ఈ సినిమా సత్తా చాటుతూ దూసుకుపోతుంది. ఇక నైజాంలో తొలిరోజే 2.37 కోట్ల వసూళ్లు రాబట్టింది వెంకీ మామ సినిమా. అటు ఆంధ్రాలో 4 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొత్తంగా మామ అల్లుళ్లు  వెంకీ మామ సినిమా తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారనే  చెప్పాలి. వెంకీ మామ సినిమా మరిన్ని భారీ వసూళ్లు రాబట్టటం ఖాయం  అంటూ అటు సినీ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకీ మామ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: