వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలన్ని కేరాఫ్  వివాదాలు అన్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. వర్మసినిమా తీసినా అందులో పెద్ద వివాదం ఇమిడి ఉంటుంది. వివాదాలు లేని సినిమాలజోలికి వర్మ అసలు పోడు . అయితే తాజాగా అమ్మ  రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాకు వర్మ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ వివాదాస్పద సినిమా వివాదాలు చుట్టుముట్టాయి. ఎట్టకేలకు వర్మ ఈ సినిమాని విడుదల చేశారు. డిసెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంధ్ర రాజకీయాలు జరిగిన జరుగుతున్న జరగబోయే పరిణామాలను సినిమాలో చూపించబోతున్న అంటూ రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. అయితే డిసెంబర్ 12న విడుదలైన రామ్ గోపాల్ వర్మ చిత్రం ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. 

 


 అయితే రామ్ గోపాల్ వర్మ పై గతంలో క్రైస్తవ మత బోధకులు కె.ఎ.పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. వర్మ  సినిమాలో తన పాత్రను తప్పు అర్థం వచ్చేలా చూపించారంటు  హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు . ఇక తాజాగా వర్మ పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కేఏ పాల్ . రాంగోపాల్ వర్మనూ ఆయన  కుటుంబం ఎప్పుడో వెలి వేసిందని ప్రజలు సైతం ఆయనను బహిష్కరించారు అని కేఏ పాల్  వ్యాఖ్యానించారు. అటు ముంబైలో సినిమాల్లేక..  ఇటు ఆంధ్రాలో సినిమాలు లేక ఎవరో  డబ్బులు ఇస్తే  అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాను తెరకెక్కించారు అంటూ కేపాల్ వ్యాఖ్యానించారు. 

 

 

 దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇలాంటి పిచ్చి సినిమాలు తీయడం ఆపేస్తే బాగుంటుంది అంటూ కే ఏ పాల్ తెలిపారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమా ద్వారా ఆంధ్ర రాజకీయాల్లో చిచ్చుపెట్టి కులాల మధ్య వివాదాలు రేకెత్తించే ప్రయత్నం చేశారని ఆరోపించిన కేఏ పాల్ .. దైవ ప్రార్థనలు చట్టం సహకారంతో వర్మ సినిమాలో అలాంటి సీన్లు ఏవీ లేకుండా చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు అనే సినిమా ఫ్లాప్ కావడంతో వర్మ గర్వం తగ్గిందని... ఎక్కడా కనీసం ముఖం కూడా చూపించుకో లేకపోతున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు. తన ఫోటో మార్ఫింగ్ చేయడం పై స్పందించిన కేఏపాల్ ఎప్పుడు సత్యమే విజయం సాధిస్తుందని హితవు పలికారు. ఇలాంటి చవకబారు ప్రచారం మానుకొని తనకు..ఆ  దేవుడికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.. తనకి క్షమాపణలు చెప్తేనే వర్మ సక్సెస్ సాధించగలరని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: