బాలకృష్ణ హీరోగా చేసిన రూలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు విశాఖ వేదికగా జరుగుతున్నది.  కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాపై భారీ నమ్మకం ఉంది.  సి కళ్యాణ్ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ ఈనెల 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఇందులో సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, బాలకృష్ణ ఇందులో చాలా గ్లామర్ గా కనిపించబోతున్నారు.  


బాలయ్య ఫస్ట్ లుక్ చూసిన రోజునే యూత్ మొత్తం షాక్ అయ్యింది.  బాలకృష్ణ ముప్పై  ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు.  ఇందులో కొత్తగా బాలయ్య ను తీర్చిద్దిదారు కేఎస్ రవికుమార్.  ఇక ఇదిలా ఉంటె, రూలర్ సినిమా కోసం బాలయ్య చాలాబాగా కష్టపడ్డారు.  రూలర్ సినిమాను భారీ బడ్జెట్ తో తెరక్కించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది.  


ట్రైలర్ లో బాలయ్య రేంజ్ ఏంటో చూపించారు.  బాలయ్యను రెండు వేరియేషన్స్ లో చూపించారు.  రెండు వేరియేషన్స్ లో బాలయ్య పాత్ర ఉండబోతున్నది.  ఇందులో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నారా లేదంటే ఒక్కరే రెండు పాత్రలు చేస్తున్నారా అన్నది తెలియాలంటే ఈనెల 20 వ తేదీ వరకు ఆగాల్సిందే.  
రూలర్ సినిమాలో బాలయ్య బిజినెస్ మెన్ గా కనిపిస్తున్నారు.

 ఒకవైపు బిజినెస్ మెన్ గా కనిపిస్తూనే మరోవైపు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.  క్రుప్తంగా చెప్పాలి అంటే ఈ సినిమా మొత్తం యూపీలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ సినిమా ఉండబోతున్నది.  యుపిలో రెండువేల తెలుగు కుటుంబాలు పడుతున్న బాధలను తీర్చేందుకు బాలయ్య ఏం చేసాడు అన్నది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. మరి ట్రైలర్ లో చూపిన విధంగానే సినిమా కూడా ఉంటుందా అన్నది తెలియాలంటే డిసెంబర్ 20 వరకు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: