తెలుగు సినిమా పరిశ్రమలో బాలయ్యది ప్రత్యేకమైన శైలి. ఆయన తనవాడు అనుకుంటే చాలా అభిమానం చూపిస్తాడని ఇండస్ట్రీలో పేరు ఉంది. నిజానికి బాలకృష్ణకు టాలీవుడ్ లో పెద్దగా స్నేహితులు ఉండరు. కానీ.. తాను నమ్మే వాళ్లను మాత్రం బాలయ్య వదులుకోరు. అలాను బాలయ్య మంచితనం తెలిసిన వాళ్లు ఆయనను వదులుకోరు. ఆయన ప్రతి అడుగులో కూడా కలిసి నడుస్తారు.. సపోర్ట్ గా ఉంటారు. టాలీవుడ్ లో అలాంటి వారిలో యాంకర్ ఉదయభాను కూడా ఒకరు.

 

 

ప్రస్తుతం బాలయ్య రూలర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశాఖలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఫంక్షన్ కు యాంకర్ గా ఉదయభాను తన మాటల మాయాజాలంతో ఆకట్టుకుంటూ నిర్వహిస్తోంది. ఉదయభానుకు బాలకృష్ణ అంటే విపరీతమైన అభిమానం. పలు ఇంటర్వ్యూల్లో కూడా ఆమె ఈ విషయాన్ని చెప్పింది. ప్రస్తుతం ఆమెకు గొంతు బాగోక పోయినా బాలయ్య మీద ప్రేమతో ఈ ఫంక్షన్ నిర్వహిస్తోంది. ఇలాంటి ఫంక్షన్లకు గొంతుతోనే పని. కానీ ఆమెకు తన ఇబ్బంది ఏమీ గుర్తు రాలేదు బాలయ్య మీద అభిమానం తప్ప. ఈ సంఘటనతో బాలయ్య తన అభిమానుల మీద చూపే ప్రేమ ఎలాంటిదో ఉదయభాను  యాంకరింగ్ తెలియజేస్తోంది.

 

 

ఉదయభానుకు కవలలు జన్మించిన సమయంలో ఇంట్లోని ఫంక్షన్ కు బాలయ్య ను ఆహ్వానించింది. ఈ ఫంక్షన్ కు బాలయ్య హాజరై ఆమె బిడ్డలను ఆశీర్వదించాడు. ఈ విషయాన్ని ఆమె ఎంతో సంతోషంతో ఓ ఇంటర్వూలో తెలిపింది. బాలయ్య లాంటి పెద్ద నటుడు తాను పిలిస్తే వచ్చి ఆశీర్వదించడం తనకు ఎనలేని సంతషం కలిగించిందని.. బాలయ్య మంచి మనసుకు ఇది నిదర్శనమని చెప్పింది. అదే అభిమానం ఇప్పుడు ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోయినా ఈ ఫంక్షన్ కు వచ్చేలా చేసింది. ఈ విషయంలో బాలయ్య గ్రేట్ అనిపించుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: