బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దాన్ని మరోసారి నిరూపిస్తూ పక్కా మాస్ సినిమాతోనే వస్తున్నాడు నందమూరి నటసింహం. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా 'రూలర్'. ఈ చిత్రానికి హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య్రక‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రూపంలో నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. 

 

ఇందులో భాగంగానే తాజాగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వైజాగ్ లోని ఎంజీఎం గ్రౌండ్స్‌లో ఘ‌నంగా నిర్వహిస్తున్నారు.  ఈ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ, హీరోయిన్లు సోనాల్ చౌహాన్, వేదిక, ఇతర చిత్రయూనిట్ సభ్యులు విచ్చేశారు. మ‌రోవైపు విశాఖ‌లో జ‌రిగిన జ‌రిగిన రూల‌ర్ ప్రి రిలీజ్ ఫంక్ష‌న్లో పోలిటిక‌ల్ హంగులు అదిరాయ‌నే చెప్పాలి. అటు టీడీపీ.. ఇటు వైసీపీ వాళ్లు కూడా బాల‌కృష్ణ సినిమా రిలీజ్ ఫంక్ష‌న్‌లో సంద‌డి చేశారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేగా బాల‌య్య ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఫంక్ష‌న్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస‌రావు, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు, వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్ వ‌చ్చారు. 

 

మ‌రియు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస్ కూడా వ‌చ్చారు. ఇక జీవితా రాజ‌శేఖ‌ర్ దంప‌తులు టీడీపీకి యాంటీ అయినా బాల‌య్య‌తో స‌న్నిహితం ఉండ‌డంతో ఈ ఫంక్ష‌న్‌కు వ‌చ్చి హైలెట్ అయ్యారు. దీంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ హంగులు ఫంక్ష‌న్లో కొత్త మెరుపులు తీసుకువ‌చ్చాయి. ఇక స్టార్ డైరక్టర్ బోయపాటి శ్రీనివాసరావు, నిర్మాత అంబికా కృష్ణ తదితరులు ఈ ప్రీరిలీజ్ ఉత్సవానికి హాజరయ్యారు. కాగా, ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్‌, ట్రైల‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. గతంలో బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ కాంబోలో వచ్చిన 'జైసింహా' సూపర్ హిట్ అయిన కారణంగా రూలర్ పై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: