సినీ పరిశ్రమలో హీరోలకు మాత్రమే లాంగ్ రన్ ఉంటుంది. కానీ హీరోయిన్లకు పదేళ్లే లాంగ్ కెరీర్.  సినిమాకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈరోజుల్లో లాంగ్ కెరీర్ ఊహించటం కష్టమే. కానీ.. 16 ఏళ్లుగా సినిమాల్లో రాణిస్తూ ఇంకా తన కెరీర్ కొనసాగిస్తున్న హీరోయిన్ త్రిష. 2003లో కెరీర్ కొనసాగించిన త్రిష ఇప్పటికీ సినిమాలు చేస్తోంది.

 

 

2003 డిసెంబర్ 13న త్రిష నటించిన తొలి తెలుగు సినిమా నీ మనసు నాకు తెలుసు విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కి విడుదలైన ఈ సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. అంతకుముందు తమిళ్ లో లేసా లేసా ద్వారా పరిచయమైంది. నిజానికి 1999లో ప్రశాంత్-సిమ్రాన్ సినిమా జోడీలో సిమ్రాన్ ఫ్రెండ్ గా నటించింది. ఆలెక్కన చూస్తే 20 ఏళ్ళు పూర్తయినట్టే. 2004లో ప్రభాస్ తో చేసిన వర్షం సినిమా త్రిష కెరీర్ ను మలుపుతిప్పింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడం.. త్రిష స్టార్ హీరోయిన్ గా మారిపోవడం జరిగిపోయింది. అప్పటి నుంచి దశాబ్దానికి పైగా తెలుగు, తమిళ భాషలను ఏలేసింది త్రిష. అందానికి తోడు,అభినయం కూడా అదే స్థాయిలో ఉండటంతో రెండు భాషల్లో ఏకకాలంలో తన హవా చూపింది. ఒకదశలో సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పింది.

 

 

తెలుగు, తమిళ్ లో తరుణ్ నుంచి చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ వరకూ అందరి హీరోలతోనూ నటించి స్టార్ స్టేటస్ అనుభవించింది. ప్రస్తుతం తమిళ్ లో రాంగీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. చాన్నాళ్ల తరువాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఆయన 152వ సినిమాలో  హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది. కెరీర్ పరంగా 16 ఏళ్ళు పూర్తయినా ఇంకా అదే అందం, నాజూకుదనంతో, నటనతో ఆకట్టుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: