‘దర్బార్‌’  ఏఆర్‌ మురగదాస్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం. సూపర్ స్టార్  రజనీకాంత్  ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత  పోలీస్‌ గెటప్‌లో అలరించనుండటంతో ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి.

 

అంతేకాకుండా ఈ సినిమాకు  విభిన్న కథలతో పాటు మంచి మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల ఎక్స్‌పర్ట్‌గా పేరుగాంచిన మురుగదాస్‌  డైరెక్ట్‌ చేస్తుండటం డబుల్‌ ప్లస్‌ కానుంది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించి రజనీ ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌, పాటలు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఐతే తాజాగా రజనీ ఫ్యాన్స్‌కు హుషారు కలిగించే వార్తను ‘దర్బార్‌’టీమ్‌ ప్రకటించింది. 

 

డిసెంబర్‌ 16(సోమవారం) సాయంత్రం 6.30 గంటలకు  ‘దర్బార్‌’మూవీ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అలాగే ఈ విషయాన్ని  తన అధికారిక ట్విటర్‌లో డైరెక్టర్‌ ఏఆర్‌ మురగదాస్‌ పోస్ట్‌ చేశాడు. డైరెక్టర్‌ మురుగదాస్‌  ‘హలో ఫ్రెండ్స్‌. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిత్ర ట్రైలర్‌ ను సోమవారం సాయంత్రం 6.30 గంటలకు  విడుదల కాబోతుంది. దర్బార్‌ యాక్షన్‌ ట్రైలర్‌తో ఎంజాయ్‌ చేయడానికి సిద్దంగా ఉండండి’అంటూ  ట్వీట్‌ చేశాడు.  

 
 ప్రస్తుతం  ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకొని  నిర్మాణాంతర కార్యక్రమాల్లో చాలా  బిజీగా ఉంది. అంతేకాకుండా సినిమా యూనిట్‌ వారు మూవీ ప్రమోషన్స్‌ కూడా భారీగా నిర్వహిస్తున్నాయి  కాగా ఐతే ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా ఇప్పుడే డిసైడ్ ఐపోయింది మొత్తానికి  ఈ చిత్రాన్ని జనవరి 9న  సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎ. సుభాస్కరన్‌  లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై  నిర్మిస్తున్న చిత్రం ఇందులో   హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. అంతేకాకున్న ఈ చిత్రంలో   నివేదా థామస్‌ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు చిత్ర యూనిట్ తెలియజేసింది . ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతమందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: