అందం అభినయం ఆ హీరోయిన్ సొంతం... చలాకి తనం హీరోయిన్ నైజం... నటనలో మంచి మార్కులు కూడా వేసుకుంది.. కానీ అవకాశాలు మాత్రం అందిపుచ్చుకోలేకపోతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా అందాల ముద్దుగుమ్మ అనుపమ. ప్రేమం సినిమాతో మలయాళ లో బాగా ఫేమస్ అయింది ఈ అమ్మడు. ఇక ఈ అమ్మడికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ  సినిమాలో గడుసు పిల్ల గా అవకాశం దక్కింది. వచ్చిన అన్ని అవకాశాలను సరిగా ఉపయోగించుకుంటూ... నటనకు మంచి మార్కులే వేసుకున్నది  ఈ అమ్మడు. ఇక ఈ అమ్మడికి తెలుగులో మంచి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.

 

 

 

 వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది  ఈ అమ్మడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడికి ఫ్యాన్  ఫాలోయింగ్ చాలానే ఉంది. అయితే ఈ అమ్మడు ఎన్ని సినిమాలు చేసిన ఈ అమ్మడుకు తగిన గుర్తింపు మాత్రం రాలేదు. కానీ  ఈ మధ్య విడుదలైన రాక్షసుడు సినిమా మాత్రం మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో  బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించిన ఈ అమ్మడు టీచర్ పాత్రలో నటించి నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో  చాలా సినిమాలు చేసినప్పటికీ ఎక్కడ గ్లామర్ రోల్స్ కి మాత్రం ఓకే చెప్పలేదు. ఎక్కడ కూడా కొంచెం అయినా అందాల ఆరబోత చేయలేదు ఈ అమ్మడు. అయితే ఈ విషయంపై మాట్లాడినా ఈ అమ్మడు... ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గ్లామర్  రూల్స్ తనకు సూట్ కావు  అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. 

 

 

 

 అంతేకాకుండా పొట్టి పొట్టి బట్టల్లో  నటించడం తనకు అస్సలు ఇష్టం ఉండదు అని చెబుతోంది.. ఒక సినిమా కోసం తప్ప మిగతా సమయాల్లో తాను మేకప్ జోలికి కూడా పోనని .. వీలైనంత నాచురల్ గా ఉండటమే తనకు ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఈ అమ్మడి తీరు  అంతా ఇంప్రెస్సింగ్ గా బాగానే ఉన్నా... కాస్తోకూస్తో అందాల ఆరబోత చేయకపోతే సినిమా అవకాశాలు రావు  కదా. అందుకేనేమో స్టార్ హీరోయిన్ కావాల్సిన ఈ అమ్మడు ఇంకా స్టార్ డమ్  సంపాదించలేక పోయింది అని అభిమానులు అనుకుంటున్నారు. మామూలుగా అయితే ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ అందరూ ఎక్కువశాతం అందాల ఆరబోత చేసేస్తూ ఉంటారు. తమ  అందాల ఆరబోతతో నే చాలా మంచి అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటూ ఉంటారు. మరి అందాల ముద్దుగుమ్మ అనుపమ కి అవకాశాలు రాకపోవడానికి కారణం అదేనా  అని  ప్రస్తుతం అనుపమ అభిమానులు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: