ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మరణం పై టాలీవుడ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇక ఆయన తెలుగు సినీ రంగానికి అందించిన విశేషమైన సేవలను గుర్తు చేసుకుంటూ ఆ ప్రతిభా శాలికి నివాళులర్పిస్తున్నారు టాలీవుడ్‌ నటులు..

 

 

గొల్లపూడి చిన్న కుమారుడు శ్రీనివాస్‌ ఆకస్మిక మరణం ఆయనను  క్రమక్రమగా బాగా కుంగదీసింది. ఇకపోతే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి చెన్నైలోని లైఫ్‌లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు.1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన మారుతీ రావు వివిధ కళారంగాల్లో తనదైన ప్రతిభను చాటుకుని బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు.

 

 

రచయితగా, నటుడుగా, జర్నలిస్ట్‌, ఎడిటర్, డైరెక్టర్ ఇలా విభిన్న రంగాలలో విశిష్ట సేవలందించారు. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులతో పాటు, ఇతర ప్రముఖులు  కూడా సంతాపం వెలిబుచ్చారు. ఇదిలా ఉండగా ఆయన భౌతిక కాయాన్ని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, భానుచందర్, నటీమణులు సుహాసిని, ప్రభ, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో పాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక వేత్తలు సందర్శించి ఘన నివాళి అర్పించారు.

 

 

ఆయన మనవళ్లు, మనవరాళ్లు విదేశాల నుంచి శనివారం చెన్నై చేరుకోగా.. ఓ ప్రైవేటు ఆస్పత్రి మార్చురీలో ఉన్న భౌతిక కాయాన్ని టి.నగర్‌లోని నివాసానికి తీసుకొచ్చి ఆప్తులు, కుటుంబీకుల సందర్శనార్థం ఉంచారు. ఇకపోతే గొల్లపూడి అంత్యక్రియలను ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో టి.నగర్‌లోని కన్నమ్మపేట శ్మశాన వాటికలో నిర్వహించ నున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

 

 

ఆయన మరణం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని ఆ రోజులను తలుచుకుని ఉద్వేగానికి లోనయ్యారు.. మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ.. గొల్లపూడి తనకు మంచి మిత్రుడని, అంతకంటే గొప్ప ఆప్తుడని చెప్పారు. ఆయనతో 1989లో పరిచయం ఏర్పడిందని, తాను ఆయన వద్ద కొన్ని వారాల పాటు శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: