దర్శకుడు కే ఎస్ రవీంద్ర సినిమా వెంకీమామా ప్రస్తుతం థియేటర్లలో ఉంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని అమితంగా ఆకర్షిస్తోంది. వెంకటేష్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు.ఈ మేరకు సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయని సమాచారం. థియేటర్ల వద్ద పెద్ద సినిమాలేవీ లేకపోవడం వెంకీ మామాకి బాగా కలిసొచ్చింది.

 

అయితే వెంకీ మామా దర్శకుడు బాబీకి మెగా క్యాంప్ నుండు పిలుపు వచ్చిందట. అల్లు అర్జున్ హీరోగా బాబీ దర్శకత్వంలో సినిమా గురించి చర్చలు జరిగాయని సమాచారం. ఈ మేరకు బాబీ అల్లు అర్జున్ కి కథని వినిపించాడట. ఆ కథ అల్లు అర్జున్ ని నచ్చి, బాబీతో సినిమా చేయడానికి రెడీ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో "అల వైకుంఠపురములో" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 

సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులై ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత బన్నీ వెంటనే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. సుకుమార్ చాలా రోజులుగా బన్నీ కోసమే వెయిట్ చేస్తున్నాడు. స్క్రిప్టు మొత్తం సిద్ధం చేసుకుని, బన్నీ ఎప్పుడు వస్తే అప్పుడు షూట్ చేయడానికి సుకుమార్ సిద్ధంగా ఉన్నాడు. అయితే బాబీతో సినిమా చేయాలంటే సుకుమార్ సినిమా తర్వాతే చేయాల్సి ఉంటుంది.

 

మరి వీరిద్దరి కామ్బినేషన్ లో నిజంగా సినిమా ఉంటుందా లేదా అన్నది తెలియాలి. బన్నీ వేణు శ్రీరామ్ తో కలిసి చేస్తానన్న "ఐకాన్" సినిమా ప్రస్తుతానికి ఆగిపోయినట్టే. వేణు శ్రీరామ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పింక్ సినిమా బిజీలో ఉన్నాడు. కాబట్టి "ఐకాన్" సినిమా అటకెక్కేసినట్టే అని అర్థం అవుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: