ఆరు పదుల వయసులో కూడా నందమూరి నట సింహం బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తున్నారు... యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దర్శక నిర్మాతలకు ఇప్పుడు బాలకృష్ణ ఒక వరం లా మారిపోయారు. ఆయనకు తగిన కథ ఉంటే చాలు సినిమా చెయ్యడానికి సిద్దమవుతున్నారు నిర్మాతలు. బాలకృష్ణ ను కలవడం, ఆయన ఓకే చెప్తే చాలు కథలో మార్పులు చేసుకుని షూటింగ్ కి సిద్దమవడం... రెండేళ్లకు మూడు సినిమాలు చొప్పున విడుదల చేస్తున్నాడు బాలయ్య... సంక్రాంతికి ఒక సినిమా దసరాకు ఒక సినిమా లైన్లో పెడుతున్నాడు.

 

ఇక తెలుగులో బాలయ్యకు మంచి మార్కెట్ ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు కాకపోవడం, రెమ్యునరేషన్ పెద్దగా తీసుకోకపోవడంతో నిర్మాతలు పెద్దగా ఇబ్బంది పడటం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలకృష్ణ క్రేజ్ చూసి ఒక బాలివుడ్ దర్శకుడు ఫిదా అయిపోయారట... బాలకృష్ణ తాజా సినిమా రూలర్... కి సంబంధించిన లుక్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి... 60 ఏళ్ళ వయసులో కూడా బాలయ్య సూట్ లో కుర్ర హీరోలు అసూయ పడేలా ఉన్నారు... ఆ ఫోటోలు బాలివుడ్ లో కొందరు షేర్ చేశారు.

 

దీనిని చూసిన ఫర్హాన్ అక్తర్... బాలకృష్ణ తో తాను సినిమా చేస్తానని చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు కరణ్ జోహార్ ని కలిసి సినిమా నిర్మించాలని కోరాడట. కరణ్ జోహార్ కి క్రిష్ కి మంచి సంబంధాలు ఉండటం, క్రిష్ కి బాలకృష్ణ కు మంచి సంబంధాలు ఉండటంతో క్రిష్ ద్వారా బాలయ్య తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడట కరణ్... తమ వద్ద బాలకృష్ణకు తగిన మాఫియా స్టోరీ ఉందని, ఫ్యామిలీ జోనర్ కూడా టచ్ అవుతుందని, సినిమా చేస్తామని చెప్పారట. ఇది క్రిష్ బాలయ్య కు సమాచార౦ ఇవ్వగా... బోయపాటి తో సినిమా అవ్వగానే మాట్లాడతా అన్నారట. ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా విడుదల చేసే ఆలోచనలో వారు ఉన్నారట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: