వరుస విజయాలు, వరుస సినిమాలు... మినిమం గ్యారెంటీ హీరో నుంచి అగ్ర హీరోగా ఎదిగిన విధానం... అగ్ర దర్శకులు కూడా సినిమాలు చేసే విధంగా మార్కెట్ పెంచుకోవడం... ఇలా సాగింది న్యాచురల్ స్టార్ నానీ ప్రస్తానం. మేకప్ లేకుండా నానీ నటిస్తాడని వచ్చిన క్రేజ్... అతని సినిమాలతో మరింతగా పెరిగింది. దీంతో చాలా మంది దర్శకులు నాలుగేళ్ల పాటు నానీతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు నిర్మాతలు కూడా అతనికి తగిన విధంగా కథలు రాసుకుని నానీతో సినిమా చేసే ప్రయత్నాలు గట్టిగానే చేసారు.

 

అయితే ఇప్పుడు మాత్రం అది మారిందని అంటున్నారు... నానీతో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. దీనికి కారణం అతనికి మార్కెట్ లో క్రేజ్ తగ్గింది అనే ప్రచారమే... నానీ దాదాపు వంద కోట్ల వరకు వెళ్ళాడు. అయితే అభిమానులను అలరించడంలో మాత్రం నాని విఫలం అయ్యాడు. ప్రయోగాలకు దూరంగా ఉండటం అతనికి కలిసి రావడం లేదని అంటున్నారు. ఎప్పుడు అదే నటన, ఆ తరహా కథలతోనే సినిమాలు చేయడం నానీ మార్కెట్ తగ్గించింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇందుకు నాని గ‌త సినిమాలు ఇటీవ‌ల సినిమాల వ‌సూళ్లే చెపుతున్నాయి.

 

ఇటీవల టాలివుడ్ దర్శకుడు ఒకరు, నిర్మాతతో వెళ్లి కలిసి తమిళ రీమేక్ కథ ఒకటి చెప్పగా అది ప్రయోగం అని తాను చేయలేను అని చెప్పేశాడట. దీనితో ఆ కథను మరో హీరో కోసం సిద్దం చేస్తున్నాడట దర్శకుడు. కథలో పట్టున్నా సరే ప్రయోగం అనే కారణంతో నానీ పక్కన పెట్టడం చూసి నిర్మాత కూడా విస్తుపోయినట్టు సమాచారం. ఇక మరో దర్శకుడు కూడా సరికొత్తగా కథ రాసుకుని వెళ్ళినా సరే... నానీ మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదని తాను ప్రయోగాలు చేయను అని చెప్పడంతో... అది మరో పది మందికి తెలియడం... నానీని పక్కన పెట్టడం జరిగాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: