అక్కినేని కుటుంబ మూడో తరం తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి చాలా ఏళ్ళయింది. నాగేశ్వరరావు, నాగార్జునలా మూడో తరం కథానాయకులు కూడా ప్రేక్షకాదరణ పొందుతున్నారు. వీరిలో యువ సామ్రాట్ నాగ చైతన్య స్పీడ్ గా ఉన్నాడు. పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు దాటింది. కొన్ని హిట్లున్నా ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ.. తనకు కరెక్ట్ గా సూట్ అయ్యే లైనప్ ని మాత్రం సెట్ చేసుకోలేదు. అయితే.. ఈ యువ సామ్రాట్ ఇప్పుడిప్పుడే తన బలమేంటో తెలుసుకుంటున్నట్టున్నాడు. అందుకే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.

 

 

ఈ ఏడాది నాగ చైతన్యకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. తన భార్య సమంతతో కలిసి చేసిన మజిలీ సూపర్ హిట్ అయింది. ఇదే జోష్ లో మేనమామతో చేసిన వెంకీ మామ కూడా హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. దీంతో నాగ చైతన్య గాడిలో పడ్డట్టేనని క్రిటిక్స్, సినీ ప్రేక్షకులు, అక్కినేని అభిమానుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో ఇమేజ్ తానెంత కరెక్ట్ గా సూటవుతానో చైతూ నిరూపించుకుంటున్నాడు. తన ఇమేజ్ కు దూరంగా కొన్ని సినిమాలు చేసిన చైతూ కొంత ఆలస్యంగానే మేల్కొన్నాడని చెప్పాలి. నిజానికి 100 పర్సెంట్ లవ్ సినిమా క్రేజ్ ను కంటిన్యూ చేసుంటే నాగ చైతన్య నుంచి మరికొన్ని మంచి సినిమాలు వచ్చుండేవి. 

 

 

చైతూ అప్పుడప్పడూ ఇలాంటి సినిమాలతోనే హిట్ కొట్టాడు. ప్రేమమ్ కూడా అదే జాబితాలోనిదే. ఇప్పుడు తాను లైన్ లో పెట్టుకున్న సినిమాలు పరిశీలిస్తే చైతూ కరెక్ట్ గా వెళ్తున్నాడనే అనిపిస్తోంది. శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ, పరశురామ్ తో సినిమాలు ఇవే జోనర్ లో రాబోతున్నాయి. ఇవి కూడా హిట్ అయితే చైతూ ద్వారా అక్కినేని నట వారసత్వం మరింత ఘనంగా చాటినట్టే. చైతూ ఇలాంటి హిట్స్ ఇస్తే అక్కినేని అభిమానులకు ఆనందమే.

మరింత సమాచారం తెలుసుకోండి: