సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రకారం,  దబాంగ్ వాస్తవానికి నెగెటివ్ షేడ్ వున్నా  చిత్రం అని,  దాని ప్రధాన పాత్ర చుల్బుల్ పాండే  అవుట్ అండ్ అవుట్ నెగటివ్  అని అయన  వెల్లడించారు.  అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించిన దబాంగ్   చిత్రంలో సల్మాన్ ఖాన్ చుల్ బుల్  పాండేగా నటించాడు, ఈ చిత్రంలో సల్మాన్  నిర్భయమైన, అవినీతిపరుడైన పోలీసు అధికారి పాత్రలో కనిపించరు.  ఇది విమర్శకుల ప్రశంసలను అందుకుంది.  విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 

 

 

 

నటుడు రణదీప్ హుడా,  అతని సోదరుడు అర్బాజ్ ఖాన్ దబాంగ్  ప్రాజెక్ట్ కోసం తన కంటే ముందు చుల్ బుల్ పాండే పాత్ర కోసం  సంప్రదించినట్లు ఒక గ్రూప్ ఇంటర్వ్యూలో సల్మాన్ వెల్లడించాడు.  దబాంగ్  నెగటివ్ షేడ్ వున్నా  చిత్రం, ఈ చిత్రానికి 2 కోట్ల లోపు బడ్జెట్ పెట్ట వచ్చా అని ,  ఆ సమయంలో  ఈ చిత్రం కోసం రణదీప్ హుడా మరియు అర్బాజ్ ఖాన్ లు పరిశీలనలో  ఉన్నారు అని సల్మాన్ అన్నారు.

 

 

 

 

 

ఎనిమిది నెలల తర్వాత నేను దబాంగ్ చిత్ర  కథ ని విన్నాను. ఈ చిత్రాన్ని యూటీవీ నిర్మిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఈ చిత్రం యొక్క కథ  నాకు బాగా నచ్చింది. నేను విన్న కథ ప్రకారం చుల్ బుల్ పాండే పాత్ర అవుట్ అండ్ అవుట్ నెగెటివ్ అని సల్మాన్ అన్నారు.  అర్బాజ్‌ తో దబాంగ్ చిత్ర కథ లో కొన్ని  మార్పులు చేయాలని సూచించానని, అభినవ్ వాటిని చేర్చుకున్నాడని  సల్మాన్ చెప్పారు.  

 

 

 

 

 

చిత్రానికి మార్పులు  చేయక  ముందు ఒక్క యాక్షన్  సీను  లేదు.   పాటలు లేవు, హీరో  తల్లిని ఎవరు చంపారో మాకు అప్పటికి  తెలియదు. మేము దానిపై పనిచేయడం ప్రారంభించాము మరియు అభినవ్ ఆ మార్పులన్నింటికీ అంగీకరించారు.  ఈ చిత్రం విజయవంతం అయిన తర్వాత మేము  అభినవ్‌ను సీక్వెల్ చేయమని కోరినప్పటికీ అతను దానికి  అంతగా మొగ్గు చూపలేదు.   తర్వాత అర్బాజ్ దబాంగ్ నిర్మాణ  బాధ్యతలను స్వీకరించారు.  దబాంగ్ 3 ఇప్పుడు డిసెంబర్ 20 న విడుదలకు సిద్ధంగా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: