తెలుగు సినిమా సంగీత దర్శకుల్లో టాప్ పొజిషన్ కు పోటీపడిన ఈ తరం సంగీత దర్శకుల్లో తమన్ కూడా ఉన్నాడు. కెరీర్లో అతి తక్కువ సమయంలో యాభై సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి రికార్డు సృష్టించాడు కూడా. ఈమధ్య తమన్ రోటీన్ సంగీతం అందిస్తున్నాడని.. కాపీ ట్యూన్లు ఎక్కువ ఇస్తున్నాడని కామెంట్లు వచ్చి కొంతమేర అవకాశాలు తగ్గాయి కూడా. అయితే ఇటివల తమన్ పుంజుకున్నాడు. తెలుగులో తన సత్తా చూపిస్తున్నాడు.

 

 

తమన్ రీసౌండ్ కు 2018 బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. తొలిప్రేమ, భాగమతి, అరవింద సమేత వీరరాఘవ.. వంటి సినిమాలతో వరుస హిట్లిచ్చాడు. రొటీన్ సంగీతం అందిస్తున్నాడన్న మాటలను దాటి వెరైటీ ట్యూన్లు ఇచ్చి మెప్పించాడు. ఈ ఏడాది కూడా తమన్ హవానే కొనసాగిందని చెప్పాలి. ప్రస్తుతం ఎక్కడ చూసినా తమన్ సినిమాలే కనపడుతున్నాయి. వెంకీమామ, ప్రతిరోజు పండగే, డిస్కో రాజా.. ఇలా ఏ సినిమా చూసినా తమన్ పేరు మోగిపోతోంది. ఇక అల్లు అర్జున్త్రివిక్రమ్ కాంబో అల.. వైకుంఠపురంలో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. రెండు మూడు నెలలుగా ఈ సినిమా పాటలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. సామజవరగమన పాటే అనుకుంటే దాన్ని మించి రాములో.. పాట మరింత సూపర్ హిట్ అయిపోయింది. పవన్ చేస్తాడంటున్న పింక్ రీమేక్ కు కూడా తమన్ సంగీతం అందించనున్నాడు.

 

 

దేవీశ్రీ ప్రసాద్ హవా తగ్గడం.. ఇదే సమయంలో తమన్ మంచి మ్యూజిక్ ఇస్తూ తన స్టామినాను నిరూపించుకున్నాడు. వరుస సినిమాలతో ఇటు తెలుగు, అటు తమిళ్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు. మొత్తానికి తమన్ టైమ్ మళ్లీ స్టార్ట్ అయిందనే అంటున్నారు. మణిశర్మ, కీరవాణిలకు పోటీనిస్తూ.. దేవీశ్రీ ప్రసాద్ తో పోటీ పడుతూ ఆయన ప్రయాణం కొనసాగింది.. కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: