ప్రస్తుతం దివంగత  స్ఫూర్తి దాయక,  వివాదాస్పద రాజకీయ నాయకురాలు  మరియు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పై రెండు సినిమాలు మరియు ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఈ వారాంతంలో వెబ్ సిరీస్ క్వీన్ ఓటిటి  ప్లాట్‌ఫాం పై  ప్రదర్శించబడనుంది.  దీనికి టైటిల్ రోల్ లో రమ్య కృష్ణ  నటించనున్నారు. గౌతమ్ మీనన్,  ప్రసాత్ మురుగేసన్ దర్శకత్వం వహించారు మరియు స్క్రీన్ ప్లే రేష్మా ఘటాలా వహించారు.

 

 

 

 

 

 

 

 

అనితా శివకుమార్ రాసిన 'క్వీన్' పుస్తకం ఆధారంగా ఈ షో రూపొందించబడిందని వెబ్ సిరీస్ నిర్మాతలు పేర్కొంటుండగా, ట్రైలర్ మరియు పోస్టర్లు జయలలిత జీవితం, ఆమె చుట్టూ వున్నా పరిస్థితులతో   సారూప్యతను స్పష్టంగా తెలుపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి  కథను ఆమె అనుమతి లేకుండా సమర్పించారని పేర్కొంటూ జయలలిత మేనకోడలు జె దీపా, గౌతమ్ మీనన్, వెబ్ సిరీస్  నిర్మాతలపై  కేసు పెట్టారు. అయితే మద్రాస్ హైకోర్టు ఓటిటి  ప్రీమియర్ స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ ప్రదర్శన డిసెంబర్ 14 నుండి ప్రసారం అవుతోంది.  

 

 

 

 

 

 

 

రమ్య కృష్ణ క్వీన్ లో  శక్తి శేషాద్రి పాత్రలో నటించింది. ఈ పాత్ర జయలలితను ప్రతిబింబిస్తుంది.   నేను ఇప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. వెబ్ సిరీస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లో  ఒక కొత్త  మాధ్యమంగా   నేను భావిస్తున్నాను; ఓటిటి  ప్లాట్‌ఫారమ్‌లు గేమ్ ఛేంజర్‌గా మారబోతున్నాయి. నేను నా కెరీర్ పీక్ లో వున్నపుడు , హీరోయిన్ కంటే శక్తివంతమైన  పాత్రలను నేను నా  ఇష్టపూర్వకంగా చేశాను. తరువాత నేను టెలివిజన్ సీరియల్స్ చేసాను.  నటిగా నాకు  కొత్త సవాళ్లను ఎదుర్కోవడం  ఇష్టం అని ఆమె అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

క్వీన్ వెబ్ సిరీస్ , అనితా శివకుమార్ నిజమైన సంఘటనల ఆధారం చేసుకొని  రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడుతుంది. రమ్య కృష్ణ ప్రకారం నేను ఈ వెబ్ సిరీస్ లో శక్తి శేషాద్రి పాత్ర పోషిస్తున్నాను. మా    స్క్రీన్ ప్లే రచయిత రేష్మా ఘటాలా నాకు కథ  వివరించినప్పుడు నేను ఈ పాత్ర , ఈ పాత్ర  ప్రయాణంతో    ప్రేమలో పడ్డాను. కొన్ని పరిస్థితుల కారణంగా పాఠశాల నుండి తప్పుకోవలసి వచ్చిన తెలివైన విద్యార్థి యొక్క కథ ఇది చాలా ఉత్తేజకరమైన కథ. తరువాత ఆమె అగ్రశ్రేణి నటిగా ఎదిగి చివరకు రాజకీయాల్లో ఒక నక్షత్రంలా మెరిసింది.  శక్తి యొక్క క్యారెక్టరైజేషన్ మీకు జయలలిత ను  గుర్తు చేస్తుంది, అందులో తప్పు ఏమీ లేదు, నేను ఆమెకు చాలా అభిమానిని.  శక్తి మరియు జయ లలిత  జీవితాల మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి, అవి యాదృచ్చికం కావచ్చు, కాని వెబ్ సిరీస్ క్వీన్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది అని ఆమె పేర్కొన్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: