ఎన్టీఆర్ టాలీవుడ్ లో సంచలన హీరో. అందులో సందేహం అవసరం లేదు.  టాలీవుడ్ లో బాల రామాయణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ టాప్ హీరో, నిన్ను చూడాలని సినిమా చేశారు.  కానీ, ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు.  రెండో సినిమా రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 వచ్చింది.  ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.  ఈ సినిమా విజయం తరువాత తరువాత సినిమా కూడా రాజమౌళి దర్శకత్వంలోనే చేశారు.  


సింహాద్రి, ఆది, యమదొంగ ఇలా వరస హిట్స్ అందుకున్న ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగారు.  డైలాగ్స్ చెప్పడంలోనూ, డ్యాన్స్ లోను తనదైన శైలిలో ఎన్టీఆర్ రెచ్చిపోయారు.  నందమూరి నుంచి సొంతంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ కు ఇప్పుడు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు.  టెంపర్ సినిమా వరకు కొంత ఇబ్బందులు పడిన ఎన్టీఆర్, టెంపర్ తరువాత ఓటమి ఎదురుకాకుండా సినిమాలు చేస్తున్నారు.  


టెంపర్ తరువాత చేసిన ఆరు సినిమాలు మంచి విజయం సాధించాయి.  అందులో ట్రిపుల్ రోల్ చేసిన జైలవకుశ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయ్యింది.  మూడు పాత్రల్లో ఎన్టీఆర్ మెప్పించారు.  మూడు పాత్రల్లో జై పాత్ర అలరిస్తుంది. ముగ్గురిలో పెద్దవాడి పాత్ర జై క్రూరుడిగా మారతాడు.  నెగెటివ్ రోల్ లో అదరగొట్టాడు.  అందరు రాముడిని ఇష్టపడితే.. పెద్దవాడు మాత్రం రావణుడిని ఇష్టపడటం.. రావణుడి గెటప్ లో అదరగొడతాడు.  


ఒకపాత్ర దొంగగా కనిపిస్తే.. మరోపాత్రలో ఎన్టీఆర్ బ్యాంక్ ఆఫీసర్ గా మెప్పిస్తాడు.  మూడు పాత్రల్లో వేరియేషన్ చూపిస్తూ చేసిన సినిమాలు అదిరిపోయాయి.  సినిమాకు ఈ పాత్రలు ప్లస్ అయ్యింది.  అన్న కళ్యాణ్ రామ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరక్కెక్కింది. అప్పటి వరకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేసిన సినిమా వరసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి.  కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన సినిమాలు కూడా ఫెయిల్ కావడంతో నిర్మాతగా కళ్యాణ్ రామ్ చాలా నష్టపోయాడు.  దీంతో అన్నకు సహాయం చేసేందుకు ఎన్టీఆర్ ముందుకు వచ్చి జైలవకుశ సినిమా చేసి అన్నను నష్టాల నుంచి కాపాడాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: