స్టాన్లీ కా డబ్బా, హవా హవాయి వంటి ప్రశంసలు పొందిన సినిమాలను అందించిన తరువాత, దర్శకుడు అమోల్ గుప్తేసైనా నెహ్వాల్ బయోపిక్ కోసం పరిణీతి చోప్రాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.  అమోల్    కొన్నేళ్లుగా ఈ మూవీ పై పని చేస్తున్నారు. పరిణీతి , సైనా తో కలుసుకుని ఈ చిత్రం  గురించి వివరంగా చర్చించుకున్నారు.

 

 

 

 

 

 

 

సన్నివేశాలు మరియు చిత్రీకరణల గురించి దర్శకుడు తరచూ అప్ డేట్ లు  ఇవ్వడం గురించి  సైనా మాట్లాడుతూ, అమోల్  నా బయోపిక్ దర్శకత్వం వహించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. అలాంటి కథలను ఎలా నిర్వహించాలో ఆయనకు బాగా  తెలుసు.  నా జీవితం గురించి ప్రతిదీ అతనికి బాగా తెలుసు. నేను ఏమి చేస్తున్నానో, నేను ఎక్కడ ఉన్నానో మరియు టీవీలో ప్రసారం చేయని మ్యాచ్‌ల ఫలితాలు కూడా అతనికి తెలుసు. చిత్రీకరించబడుతున్న సన్నివేశాల గురించి మరియు పరిణీతి తో  కొనసాగుతున్న ప్రిపరేషన్ గురించి అయన నాకు క్రమం తప్పకుండా  అప్ డేట్ లు ఇస్తారు.

 

 

 

 

 

 

 

 

 

పరిణీతి చిత్ర షూటింగ్ విశేషాలను వివరిస్తూ , నేను సెట్‌కి చేరుకున్నప్పుడు, నేను నేనే, కానీ నేను నా వానిటీ వ్యాన్‌ను విడిచిపెట్టినప్పుడు, నేను సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్  తన క్రీడ రంగంలో మంచి  నైపుణ్యం గల క్రీడాకారిణి.  బ్యాడ్మింటన్ రంగంలో సైనా ఎన్నో అద్భుతమైన  విజయాలను సాధించింది.  నేను సైనా బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆడినప్పుడు   ఎప్పుడూ చూడలేదు. మా ఇద్దరి  భౌతిక లక్షణాలు సరిపోలడం నాకు ఒక   వరం.    ఇప్పటివరకు, మేము డైలాగ్ నడిచే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాము. ఇప్పుడు, మేము చారిత్రాత్మక మ్యాచ్ ల  షూటింగ్ ప్రారంభిస్తాము. నిజమైన పోరాటం అప్పుడు ప్రారంభమవుతుంది.

 

 

 

 

 

చిత్రం లో సైనా పాత్రను ప్రేక్షకుల ముందు తేవడానికి   నేను 45  రోజుల ట్రైనింగ్ తీసుకుంటున్నానని పరిణితి పేర్కొన్నారు. తన శయ శక్తుల  ప్రయత్నించి సైనా పాత్రను చిత్రం లో మంచిగా తెరకెక్కించి ఆమె ను సంతోషన్నీ ఇవ్వడమే తన లక్ష్యం అని పరిణీతి చోప్రా  పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: