బాలకృష్ణ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది మాస్ యాక్షన్, భారీ డైలాగులు, ఫైట్లు. ఇదే ఫార్ములాతో బాలయ్య ఎన్నో ఏళ్లుగా నెట్టుకొస్తున్నాడు. ఇవన్నీ అభిమానులను అలరించే సినిమాలే. వారికి కావాల్సిన సినిమాలు చేయడంలో బాలయ్య ఎప్పుడూ తప్పలేదు. కానీ ఎప్పుడూ బాలయ్య చేసే తప్పే ఇప్పుడు కూడా చేస్తున్నాడని అంటున్నారు. ఈరోజు బాలయ్య నటించిన కొత్త సినిమా రూలర్ ధియేటర్లలో సందడి చేస్తోంది. టీజర్ లోనే బాలయ్య ఏ విధమైన సినిమా చేస్తున్నాడో ఓ అంచనా వచ్చేసింది.. ఫ్యాన్స్ కు, ఆడియన్స్ కు.

 

 

రూలర్ సినిమా మొత్తం అభిమానులను అలరించే విధంగానే ఉందని అంటున్నారు. కానీ ఇందులో ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే అంశాలు లేవని తెలుస్తోంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్.. సినిమాలు ఫ్యాన్స్ అలరిస్తూనే వినూత్నమైన కథ, కథనాలతో ఆ సినిమాలు బాలకృష్ణ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీస్ గా నిలిచిపోయాయి. కానీ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ ఈ పద్ధతిని ఫాలో కావడం లేదు. బాలయ్య సినిమాలు చూస్తే ఇదే అర్ధమవుతోంది. బాలయ్య ఇందుకే సూటవుతాడని దర్శకులే మన మీద రుద్దేస్తుంటే ఇంక బాలయ్య నుంచి కొత్త సినిమాలు ఎలా వస్తాయని అభిమానులే అనుకునే పరిస్థితి వస్తోంది.

 

 

భారీ డైలాగులు, ఒక అంశాన్ని తీసుకుని దాని గురించే పేజీలకు పేజీలు డైలాగులు చెప్పేస్తే చప్పట్లు కొట్టే పరిస్థితి లేదిప్పుడు. కానీ.. బాలయ్య ఇదే పద్ధతిని ఫాలో అయిపోతూ ఫ్యాన్స్ కి కూడా తలనొప్పి తెప్పిస్తున్నాడు. జైసింహ సినిమాను తీసిన కేఎస్ రవికుమార్ రూలర్ ను కూడా తెరకెక్కించాడు. ఆ సినిమాలోనూ.. ఈ సినిమాలోనూ ఒకటే ఫార్ములా ఫాలా అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ కు కిక్ తెప్పించే డైలాగులు మాత్రమే సరిపోతుందా.. ఫ్యామిలీ, యువత పరిస్థితేంటి అని వారే అనుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: