ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్ట బిల్లు తీసుకు రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యతిరేకత నెలకొంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్ట బిల్లుపై జాతీయ స్థాయిలో ఉన్న కీలకమైన పార్టీలు నాయకులు మరియు జాతీయ మీడియా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని కొంతమంది అంటుంటే మరికొంత మంది వ్యతిరేకత తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో చాలా మంది విద్యార్థులు యూనివర్సిటీకి చెందిన నాయకులు బీజేపీ ప్రభుత్వం ఒక పక్కా ప్లానింగ్ తో దేశంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి పౌరసత్వ సవరణ చట్ట బిల్లు తీసుకు రావటం జరిగిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ బిల్లుపై నిరసనలు ఆందోళనలు చేస్తున్న ఆందోళనకారులపై దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి.

 

ఈ క్రమంలో తాజాగా చెన్నైలో వల్లూవర్ కొట్టంలో పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా 600 మంది ఆందోళనలు చేపట్టడంతో చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా నటుడు సిద్ధార్థ్, గాయకుడు టిఎం కృష్ణ, విసికె చీఫ్ థోల్ తిరుమావళవన్, వెల్ఫేర్ పార్టీకి చెందిన మొహమ్మద్ గౌస్ ఇందులో ఉన్నారు. సెక్షన్ 143 కింద నిరసనకారులపై కేసు నమోదైంది. రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలతో సహా 38 గ్రూపులు నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించినప్పటికీ.. ఆందోళన చేపట్టినట్లు ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎక్కువ నిరసనలు అవుతున్న సందర్భంలో సామాన్య జనులు చాలా ఇబ్బందులు ఆస్తి నష్టం ఎక్కువ అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏ క్షణాన్నైనా నిరసనలో పాల్గొన్న వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని జాతీయ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.

 

కేసు తీవ్రతరం అయితే సిద్దార్థ మరియు ఎఫ్ఐఆర్లో ఉన్నవాళ్లు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క లెఫ్ట్ పార్టీ నేతలు పక్కా ప్లానింగ్ తో మత గొడవలు దేశంలో సృష్టించడానికి బిజెపి పూనుకుందని దేశ ప్రజలంతా కలసికట్టుగా ఉండాలని వ్యాఖ్యానిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: