టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో దుమ్మురేపుతున్నారు.  సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా వెండి వెరకు పరిచయం అయ్యారు.  మురారి,అతడు, ఒక్కడు సినిమాలతో మంచి విజయాలు అందుకున్నా.. క్లాస్ ఇమేజ్ మాత్రమే సొంతం చేసుకున్నాడు.  ఇక డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ సినిమాతో ఊరమాస్ లుక్ లో కనిపించాడు. అప్పటి తెలుగు రాష్ట్రాల్లో పోకిరి కలెక్షన్ల పరంగా రికార్డుల మోత మోగించింది. వెంటనే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు’ సినిమాతో కడుపుబ్బా నవ్వించాడు మహేష్ బాబు.  ఓ వైపు ఫ్యామిలీ, మాస్, క్లాస్ వర్గాలను తనవైపు తిప్పుకున్న మహేష్ బాబు ప్రముఖ రచయిత, దర్శకులు కొరటాల శివ తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’ మూవీతో  సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు.  

 

మూవీ తర్వాత బ్రహ్మోత్సవం, స్పైడర్ తో ఘోర పరాజయాలు పొందారు.  ఆ తర్వాత కొరటాలతో ‘భరత్ అనే నేను’ మూవీతో రాజకీయ కోణంలో వచ్చారు. ఈ ఏడాది వంశిపైడి పల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ లాంటి సోషల్ మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. రైతులను ఎలా గౌరవించాలి..వారి ఆదాయం ఎలా చేకూర్చాలి అన్న కాన్సెప్ట్ అన్ని వర్గాల వారికి నచ్చింది. ఇక మహేష్ బాబు మూవీస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. తన కుటుంబానికి మరింత ప్రాధాన్యత ఇస్తారు.  ఆయన కూతురు సితార చిచ్చర పిడుగు.. పిట్ట కొంచెం కూత గనం అన్నట్టు అప్పుడే సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంది.  

 

తన తండ్రికి సంబంధించిన మూవీ సాంగ్స్ కి డ్యాన్స్ చేయడం..తన అన్న గౌతమ్ తో ప్రతి ఈవెంట్ సెలబ్రెట్ చేయడం ఆ ఫోటోలు నమ్రత శిరోత్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామన్.  తాజాగా ‘మహర్షి’ సినిమాలోని  పాటలకు డ్యాన్స్‌ చేసి అందరి మన్ననలూ పొందింది. సితారకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వదిలితే చాలు.. షేర్లు, లైకులతో వాటిని వెంటనే వైరల్‌ చేసేస్తూంటారు నెటిజన్లు. తాజాగా తన తండ్రి మహేష్‌ , రష్మిక నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలోని ‘హీజ్ సో క్యూట్’  పాటకు సితార డ్యాన్స్‌ చేస్తుండగా తీసిన ఓ వీడియో బయిటకు వచ్చింది. ఫ్యాన్స్ ఆ వీడియోని తెగ షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: