సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య స‌మ‌ర్ప‌ణ‌లో నైనా గంగూలి, సూరి హీరోహీరోయిన్లుగా `అగస్త్య మంజు` దర్శక‌త్వంలో రూపొందిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `బ్యూటిఫుల్` (ట్రి బ్యూట్ టు రంగీలా) అనేది ఉప శీర్షిక. టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మాత‌లు. ఇప్పటికే విడుదలైన పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. జ‌న‌వ‌రి 1న ఈ చిత్రం గ్రాండ్ గా విడుద‌ల‌కానుంది.  కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ డిసెంబర్ 23న హైదరాబాద్ ఐటిసి కోహినూర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నైనా గంగూలీ విసిరిన స‌వాల్‌కు  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటి సారి స్టేజ్ మీద నైనా గంగూలీతో క‌లిసి  డాన్స్ వేసి ఆమెకు బ‌దులివ్వ‌డం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి .కల్యాణ్, తుమ్మలపల్లి రాంసత్యనారాయణ, న‌ట్టి కుమార్‌,చంద్ర సిద్దార్థ్, బి వి ఎస్ రవి, తదితరులు పాల్గొన్నారు.

 

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ - `` బ్యూటిఫుల్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. నేను 'రంగీలా' సినిమా తీయడానికి చాలాముఖ్యకారణం ఊర్మిళ. ఊర్మిళ లాంటి అమ్మాయి లేకుంటే నేను రంగీలా సినిమా తీసుండేవాణ్ణి కాదు. అదే ఇప్పుడు నైనా విషయంలో జరిగింది. కొంత మంది యాక్టర్స్ కొన్ని ప్రత్యేక మైన క్యారెక్టర్స్ కోసమే క్రియేట్ అయ్యారనిపిస్తుంది. ఈ సినిమా కాస్టింగ్ కోసం చూస్తున్నప్పుడు అదే జరిగింది. అగస్త్యమంజు మీద నాకెప్పుడూ చాలా నమ్మకం ఉంటుంది. సిన్సియర్ గా వర్క్ చేస్తారు. ఈ లవ్ స్టోరీని ఒక కొత్త పంథాలో సరికొత్తగా చూపించారు.  నట్టి కుమార్‌, అంజయ్య గారితో కలిసి ఈ సినిమా చేశాం. వారికి ధన్యవాదాలు. సూరి మొదటి సినిమా అయినా ఏ మాత్రం తగ్గకుండా సూపర్ గా చేశారు. రవిశంకర్ ఫంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. 'బ్యూటిఫుల్' అనేది నాకు తెలిసిన ఒక అమ్మాయికి సంబందించిన కథ. నేను గత పది పదిహేనేళ్లుగా లవ్ స్టోరీ జోలికి వెళ్ళలేదు. దానికి రెండు కారణాలు ఒకటి నన్నుఅంతగా ఇన్స్పైర్ చేసిన కథ రాలేదు. రెండు నన్ను అంతగా ఇన్స్పైర్ చేసిన యాక్టర్ దొరకలేదు. అవి రాగానే ఈ సినిమా మొదలుపెట్టాం. బ్యూటిఫుల్ అంటే మనసుకి ఆహ్లాదం కలిగించి మనల్నిఉద్రేకానికి గురిచేసే ఏ ఎమోషన్ అయినా బ్యూటిఫుల్. నేను నా హిట్ ని ఎంత బ్యూటిఫుల్ గా తీసుకుంటానో నా ప్లాఫ్ ని కూడా అంతే బ్యూటిఫుల్ గా తీసుకుంటాను. నా లైఫ్ లో ఎవరి మీద కంప్లైంట్ చేయను..నాకు ఎవరిమీద కోపం రాదు. నేను బ్యూటిఫుల్ కాక పోవచ్చు కానీ నా లైఫ్ మాత్రం బ్యూటిఫుల్ గా గడిపాను" అన్నారు.

దర్శకుడు అగస్త్యమంజు మాట్లాడుతూ

- " ఈ సినిమా అంతా బొంబాయి లో ఉన్న దారవి అనే ఏరియాలో జరుగుతుంది. అది అంత 'బ్యూటిఫుల్' ప్లేస్ కాదు. కానీ అక్కడ మనుషులు బ్యూటిఫుల్ గా ఉంటారు. అందుకనే ఈ సినిమాకి ఆ పేరు పెట్టడం జరిగింది' అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: