మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్.  వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘రేయ్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ మూవీ మొదట రిలీజ్ కాలేదు.  పిల్లా నువ్వులేని జీవితం మూవీ రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది.  ఈ మూవీలో రెజీనా కసండ్ర హీరోయిన్ గా నటించింది.  ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సుబ్రమణ్యం ఫర్ సేల్ కూడా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత రాశీఖన్నా హీరోయిన్ గా ‘సుప్రీమ్’ మూవీతో మరో విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుస అపజయం పొందాయి.  ఈ ఏడాది ‘చిత్రలహరి’తో మంచి విజయం అందుకున్నాడు.   

 

ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ప్రతిరోజూ పండగే' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ప్రతిరోజూ పండగే' సినిమా తాత - మనవడు మధ్య సాగే కథ. ఈ సినిమాలో తాతగా సత్యరాజ్ .. మనవడిగా నేను నటించాము. నిజంగా సత్యరాజ్ గారి స్థానంలో మా తాతయ్యను ఊహించుకుంటూనే మనవడిగా నా పాత్రను చేశాను. అందుకే నా పాత్ర మరింతగా ఆడియన్స్ కి కనెక్ట్ అయిందని కూడా నేను భావిస్తున్నాను.  మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం..ఆయనతో చాలా ఎమోషన్స్ పంచుకునేవాడిని అన్నారు. ఇక నాకు భవిష్యత్ లో మా పెద్ద మామయ్య చిరంజీవి గారు నటించిన చంటబ్బాయ్ సినిమా అంటే చాలా ఇష్టం అన్నారు. 

 

మూవీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పొట్టచెక్కలయ్యేలా ఉంటుందని.. ఒక ఎమోషన్ సీన్ ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తుందని అన్నారు. తనకు భవిష్యత్ లో  చంటబ్బాయ్కి  సీక్వెల్ అని కాదుగానీ, ఆ జోనర్లో చేయాలనుంది. చిన్న మావయ్య పవన్ కల్యాణ్ చేసిన సినిమాల్లో 'ఖుషీ' .. 'తొలిప్రేమ' అంటే చాలా ఇష్టం. ఆ తరహా కథలను చేయాలనుంది అంటూ చెప్పాడు. మొత్తానికి ఈ ఏడాది రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న సాయిధరమ్ తేజ్ భవిష్యత్ లో మంచి కథలు ఎంచుకుంటానంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: