బాలీవుడ్ లో 1920 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అదా శర్మా తెలుగులో పూరి జగన్నాథ్ డైరక్షన్ లో హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయమైంది. తెలుగులో పెద్దగా క్లిక్ అవకున్నా అడపాదడపా వచ్చిన అవకాశాన్ని చేస్తుంది. 2019లో తెలుగులో చేసిన కల్కి సినిమా అమ్మడికి పెద్దగా క్రేజ్ తీసుకు రాలేదు. రీసెంట్ గా వచ్చిన కమాండో 3లో అలరించిన అదా శర్మ సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో ఎక్కువ హడావిడి చేస్తుంది.

 

పండుగ ఏదైనా తీయని వేడుక చేసుకుందాం అని ఛాక్లెట్ యాడ్ లో లాగా అదా శర్మ ఛాన్స్ దొరికితే చాలు తన టాలెంట్ చూపించేస్తుంది. మొన్నటిదాకా తన హాట్ ఫోటో షూట్స్ తో రకరకాల భంగిమల్లో పిచ్చెక్కించిన ఈ అమ్మడు చిన్న చిన్న వీడియోలతో మెసేజులు ఇచ్చింది. తను చేసే ఏ పనిలో అయినా గ్లామర్ షో విషయంలో రాజీ పడలేదు అమ్మడు. ఇక లేటెస్ట్ గా క్రిస్ మస్ సందర్భంగా జింగిల్ బెల్స్ సాంగ్స్ కు కథక్ లో డ్యాన్స్ వేసింది అదా శర్మ.

 

ప్రస్తుతం అదా శర్మ చేసిన ఈ జింగిల్ బెల్స్ కథక్ స్టైల్ డ్యాన్స్ ఆమె ఫాలోవర్స్ ను మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఇండియన్ స్టైల్ లో క్రిస్ మస్ సాంగ్స్ కు అదా చేసిన ఈ కథక్ డ్యాన్స్ అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ డ్యాన్స్ వీడియో అదా శర్మ ఇన్ స్టా ఎకౌంట్ లో పెట్టగా ఇప్పటికే లక్ష వరకు వ్యూస్ వచ్చినట్టు తెలుస్తుంది.

 

రెడ్ డ్రెస్సులో అదా శర్మ కథక్ లో జింగిల్ బెల్స్ డ్యాన్స్ చేస్తుంటే ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రిపీటెడ్ మోడ్ లో అదా డ్యాన్స్ చూసి ఆనందిస్తున్నారు. మొత్తానికి ఇలా క్రిస్ మస్ రోజున జింగిల్ బెల్స్ డ్యాన్స్ చేస్తూ తన టాలెంట్ చూపించింది అదా శర్మ. సినిమాలో ఛాన్సులు ఎలా ఉన్నా తన  వీడియోల ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంటుంద్ అదా శర్మ. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

What do you want for Christmas? I'm no santa ...just asking out of curiosity 😁 btw I'm a little careful wishing for stuff coz I actually get what I want.... I think Santa has a crush on me 🤣🤣🤣 so maybe you can tell me what u want and I'll put in a word .... सिफारिश 87.3% of the times it works This is my version of #jinglebells indian style ...Merry christmas to all of you !! . . . (park avenoooo, coconut milk vegetable steoooo , Peacock bluuuuu, internal revenue I wanted to rhyme this post but now I'm too sweaty and hungry and I wanted to quickly upload this ) . All I want for christmas is whoooo...guess whoo..even I can't guess but u can if u have nothing else to dooooo... #merrychristmas #christmas #christmasdance

A post shared by adah Sharma (@adah_ki_adah) on

మరింత సమాచారం తెలుసుకోండి: