తెలుగు సినిమాలో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది. కాబట్టి దర్శకులు కూడా కొత్త కొత్త కథలతో, విభిన్నమైన కాన్సెప్ట్ లతో, అంతకు విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. కథలో కొత్తదనం లేకుండా, కథనం నడిపించేదిగా లేకుంటే సినిమాని ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే కథ నచ్చకుంటే వెంటనే తిప్పి కొడుతున్నారు.

 

ఇంతకు ముందులా పరిస్థితులు లేవు. సినిమా బాలేకున్నా ఆడే ఛాన్స్ అస్సలు లేదు. నాలుగు పాటలు, ఐదు ఫైట్లు పెట్టి సినిమా తీస్తే, వాటిని హిట్ చేయడానికి ఆడియన్స్ రెడీగా లేరు. తెలుగులో సినిమాలు బాలేకుంటే వేరే భాషలో చూడడానికి రెడీగా ఉన్నారు. అలాగే డిజిటల్ మీడియాలో ఎన్నో ఆల్టర్నేటివ్స్ వచ్చాయి. కాబట్టి సినిమాలో కాసింతైనా కొత్తదనం ఉండాల్సిందే. అయితే సీనియర్ దర్శకులు ఈ కొత్తదనాన్ని అందుకోలేక చతికిల పడుతున్నారు.

 

అలాంటి వారిలో శ్రీను వైట్ల కూడా ఒకరు. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా ఉన్న శ్రీనువైట్ల ప్రస్తుతం స్ట్రగ్లిమ్గ్ పొజిషన్ లో ఉన్నాడు. అతడి నుండి వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ ఎలాంటి ఫలితం ఇచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే వరుస ఫ్లాపుల అనంతరం శ్రీను వైట్ల కూడా అప్డేట్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. గతేడాది 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాతో మరో సారి  చేతులు కాల్చుకున్న శ్రీను వైట్ల ఈ ఏడాది గ్యాప్ తీసుకొని ఎట్టకేలకు నెక్స్ట్ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసాడు. 

 


లేటెస్ట్ గా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చేసిన తప్పులు ఒప్పుకొని కొత్త కథతో కొత్తగా సినిమా తీయాలని తెలిసొచ్చిందని అన్నాడు. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాకు డెబ్బై శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని మరికొన్ని రోజుల్లోనే మిగతా వర్క్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది ఆరంభంలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తానని తెలిపాడు. మరి అప్డేట్ అయ్యానని చెప్తున్న ఈ దర్శకుడు నిజంగా అయ్యాడా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: