సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు. రాబోయే సంక్రాంతికి ఎలాగైనా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయం సాధించాలని అనిల్ రావిపూడి దర్శకత్వం లో కమర్షియల్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ స్టోరీ కలిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ అనే ఈ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. సినిమాకి సంబంధించిన పాటలు మరియు టీజర్ ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు మరియు నెటిజన్లు తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో దాదాపు 13 సంవత్సరాల తర్వాత సీనియర్ హీరోయిన్ విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వటంతో సరిలేరు నీకెవ్వరు సినిమా పై టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు మహేష్ అభిమానులలో బీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి.

 

ఇదే తరుణంలో సినిమాలో మహేష్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన నటిస్తుండగా ఐటెం గర్ల్ గా తమన్నా నటిస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో అందరినీ షాక్ కి గురి చేసే విధంగా సినిమాకి సంబంధించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాలో తమన్నా ఐటెం గర్ల్ కాదు అని షాకింగ్ సీక్రెట్ బయట పెట్టాడు. తాజాగా ఇటీవల సోషల్ మీడియా లో మాట్లాడిన ఆయన అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెబుతూ సరిలేరు నీకెవ్వరు సినిమా కి సంబంధించి రిలీజ్ అయినా సాంగ్స్ ని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సినిమాలో తమన్నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ...తమన్నా సినిమాలో హీరోయిన్ అని బోర్డర్లో ఉన్న మహేష్ తో ఆడి పాడటం జరుగుతుందని అనిల్ రావిపూడి తెలిపాడు.

 

ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన అన్ని పాటలు అదరగొట్టే రీతిలో ఉంటున్న నేపథ్యంలో ఆయనకు కృతజ్ఞతలు అని వీడియోలో తెలిపారు. మొత్తంమీద చూసుకుంటే సినిమాలో తమన్నా క్యారెక్టర్ హైలెట్ అని తమన్నాతో మహేష్ చేయబోయే సాంగ్ కూడా చాలా జోష్ ఇచ్చే సాంగ్ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: