పాట అనగానే మధురంగా మదిలో రాగాలు పలికిస్తూ హయినిస్తూ సాగే సంగీతం. ఆ సంగీత సరిగమల్లో తేలిపోతు ప్రపంచాన్ని మరచిపోయే సంగీత ప్రియులు కూడా ఉన్నారు. ఒక పాట వింటుంటే ఆ పాట తాలూకు భావం మదిలో స్మరించుకుంటూ బాధలన్నీ మరచిపోవచ్చూ.

 

 

అంతే కాకుండా సంగీతం ఒక అద్భుతం! సృష్టిలో దాని స్థానం అద్వితీయం. అందుకే దేవతలు సైతం సంగీతాన్ని వదలలేక పోతుంటారు.. అందువల్లే కాబోలు, చదువుల తల్లి 'సరస్వతీ దేవి'కి కూడా ఓ చేతిలో పుస్తకం, మరో చేతిలో వీణ అలంకరించింది.. ఇక ఆత్మ పల్లవించే పడవలా, వెచ్చని పాటలతో, వెండి అలలపై నిద్రిస్తున్న రాజహంసలా అలనాటి సినిమా సంగీతం ఎక్కడ. నేటి రణగొణ ధ్వనులతో నిండి, గల్లీ గల్లీలో సునామీలా దద్దరిల్లే నేటి సంగీతం ఎక్కడ. ఇదిలా ఉంటే కొన్ని కొన్ని పాటలు ఎంత బాగున్న ప్రేక్షకులకు చేరువ కాలేవు. మరికొన్ని పాటలైతే విడుదల అవ్వడం ఆలస్యం. సునామీ సృష్టిస్తాయి.  

 

 

ఇకపోతే విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ ను రాబట్టిన లిరికల్ సాంగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం.. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీలోని మైండ్ బ్లాక్ అనే సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 7.87 మిలియన్ వ్యూస్, 133k లైక్స్ రాబట్టింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురములోని రాములో రాములా అనే పాట 7.39 మిలియన్ వ్యూస్, 315k లైక్స్ రాబట్టింది. ఇదే చిత్రంలోని సామాజవరగమన అనే పాట 5.11 మిలియన్ వ్యూస్, 312k లైక్స్ తెచ్చుకోగా, ఓ మై గాడ్ డాడీ అంటూ సాగే సాంగ్ కూడా 3.21 మిలియన్ వ్యూస్ , 172k లైక్స్ ను రాబట్టుకుంది...

 

 

ఇకపోతే మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మూవీలోని వచ్చాడయ్యో సామి అనే గీతం 3.28 మిలియన్ వ్యూస్, 189k లైక్స్ తెచ్చుకోగా, థిస్ ఈజ్ మి అనే పాట 3.15 మిలియన్ వ్యూస్, 187k లైక్స్ తో ఆడియన్స్ ను అలరించింది. ఇక మహర్షి చిత్రంలోని చోటి చోటి అనే సాంగ్ 3.20 మిలియన్ వ్యూస్, 130k లైక్స్ ను తెచ్చుకుంది. ఆ తర్వాత రాం చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలోని రంగమ్మ మంగమ్మ అనే సాంగ్ 3.06 మిలియన్ వ్యూస్, 152k లైక్స్ రాగా, ఎంత సక్కగున్నావే పాట 3.02 మిలియన్ వ్యూస్, 146k లైక్స్ చేరుకుంది. ఇకపోతే జూనియర్ ఎన్‌టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలోని పెనివిటి అంటూ సాగే సాంగ్ 2.91 మిలియన్ వ్యూస్, 150k లైక్స్ రాగా అనగనగా అంటూ సాగే గీతానికి 2.61 మిలియన్ వ్యూస్, 144k లైక్స్ వచ్చాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: