సాధారణంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా హీరోల కంటే హీరోయిన్ లకే రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి స్టార్ హీరోల సరసన కూడా బుంబాయ్ నుండి కొత్త మోడల్ ని తీసుకొచ్చి హీరోయిన్ గా పరిచయం చేస్తారు. కానీ కొత్తగా వచ్చిన కారణంగా రెమ్యూనరేషన్ మాత్రం హీరోకిచ్చిన దాంటో పదవ వంతు కూడా ఇవ్వరు. బాగా పాపులర్ అయిన స్టార్ హీరోయిన్స్ లో కూడా ఒకరో ఇద్దరికో కాస్త అటు ఇటుగా హీరో కి దగ్గరగా రెమ్యూనరేషన్ ఇస్తుంటారు. అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలైతేనే. ఈ విషయంలో మాకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే చాలా సందర్భాలలో హీరోయిన్స్ వాపోయిన సంగతి తెలిసిందే.

 

అయితే ఈ విషయంలో ఏ ఇండస్ట్రీ నుంచి ఒక్క హీరో కూడా మాట్లాడింది లేదు. హీరోయిన్స్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి గొంతు విప్పిన హీరో ఎవరూ ఇప్పటి వరకు కనిపించలేదు. కానీ ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ హీరో హీరోయిన్స్ కి సపోర్ట్ గా మాట్లాడారు. వాళ్ళకి తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం చాలా అన్యాయమని స్పదించాడు. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయి బాగా వైరల్ అవుతోంది. 

 

హీరోలకు సమానమైన - హీరోల కన్నా ఎక్కువ పారితోషికం తీసుకునే నటీమణులు చాలా చాలా తక్కువమంది ఉన్నారు. దేశంలోని అన్ని భాష చిత్ర పరిశ్రమలలో ఈ విషయం గమనించినా.. ఒకరిద్దరు మాత్రమే అలా హీరోలకు ధీటైన పారితోషకం అందుకుంటున్నారు. సౌత్ లో అయితే మరీ దారుణం. హీరోల కన్నా చాలా చాలా తక్కువ పారితోషికాన్ని హీరోయిన్లకు ఇస్తున్నారు. సినిమాలకు హీరో ఎంత ఇంపార్టెంటో - హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. కొన్ని సినిమాలను హీరోయిన్లే తమ గ్లామర్ తో కాపాడుతూ ఉంటారు. కానీ పారితోషకం విషయంలో వారు వెనుకబడే ఉన్నారు. ఇలాంటి క్రమంలో వారి పారితోషకం గురించి గళం విప్పాడు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్.

 

నిజానికి హీరోల కన్నా హీరోయిన్లకే ఎక్కువ పారితోషకం ఇవ్వాలని సైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారి కష్టం ఎక్కువగా ఉంటుందని వారు మాత్రం తక్కువ పారితోషకం పొందుతున్నారని సైఫ్ తన ఆవేదనని వ్యక్తం చేశాడు. ఇలా సౌత్ హీరోయిన్స్ తరఫున గళం విప్పిన సైఫ్ తో పాటు ఈ విషయంలో మిగతా బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తారేమో చూడాలి! అయితే ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ హీరోయిన్స్ మాకు సపోర్ట్ గా మాట్లాడినందుకు కృతజ్ఞతలు అంటూ మాకొసం ఇంకాస్త గట్టిగా మాట్లాడరా అంటూ ఆయన దగ్గరికి క్యూ కడుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: