యాక్షన్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్, మన తెలుగు వారికి కూడా ఎంతో సుపరిచితం. టాలీవుడ్ స్టార్ హీరో సూర్య తో ఆయన తీసిన గజినీ సినిమా, అప్పట్లో తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఆ తరువాత సూర్యతోనే ఆయన తీసిన సెవెంత్ సెన్స్ సినిమా కూడా బాగానే ఆడింది. ఆ తరువాత విజయ్ తో తుపాకీ, కత్తి వంటి సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన మురుగదాస్, అనంతరం తీసిన సినిమాలతో వరుసగా అపజలయాలు అందుకున్నాడు. మొదటగా ఇటీవల బాలీవుడ్ లో సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన అకీరా సినిమాని తీసిన మురుగదాస్

 

దానితో పెద్ద ఫ్లాప్ ని అందుకున్నాడు. అనంతరం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ సినిమా తీసి మరొక ఘోర పరాజయాన్ని అందుకున్నాడు. ఇక ఇటీవల విజయ్ హీరోగా మూడవసారి ఆయన దర్శకత్వం వహించిన సర్కార్ కూడా పెద్దగా ఆడలేదు. ఈ విధంగా వరుసగా మూడు పరాజయాలు చవి చూసిన మురుగదాస్, తన కెరీర్లోనే మొట్టమొదటి సారిగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో దర్బార్ అనే సినిమాని తీస్తున్నాడు. రాబోయే సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే విడుదలై రజిని ఫ్యాన్స్, 

 

సాధారణ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించాయి. కాగా ఈ సినిమా సక్సెస్ పై రజిని ఫ్యాన్స్ లో మాత్రం కొంత అనుమానం కలుగుతోందట. ఈ సినిమా ట్రైలర్ ని బట్టి చూస్తే ఇది పక్కా మాస్ సినిమా వలె ఉన్నప్పటికీ, సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో అని అనుమానంగా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గతంలో వచ్చిన మహేష్ స్పైడర్, విజయ్ సర్కార్ సినిమాల విషయమై ఆయా హీరోల ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను తలక్రిందులు చేసిన మురుగదాస్, ఈ సినిమాను ఏమి చేస్తాడో అని భయపడుతున్నారట. మరి మురుగ ఈ సినిమాతో ఎంత మేర హిట్ కొడతాడో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: