ఇటీవల కాలంలో బాగా పాప్యులర్ అయినా పేరు "శ్రీరెడ్డి". ఈ పేరు చెప్తే తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరంలేదు ఆమె ఎవరనేది. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చెప్పడానికే వీలు లేనిది. వివాదాస్పద కామెంట్స్ చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తోంది. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో టాలీవుడ్‌ లోని పెద్దపెద్ద వాళ్ల పై తీవ్ర ఆరోపణలు చేసిందామె.  


టాలీవుడ్‌ ను ఒక ఊపు ఊపేసిన ఈమె ప్రస్తుతం చెన్నైలో సేద తీరుతోంది. అక్కడి నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా కామెంట్‌ లు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌ గా మారింది. ఇంత వివాదాస్పదమైన నటి పేరు పై ఇప్పుడో సినిమా వస్తోంది. ఆర్యన్‌, ఉపాసన జంటగా రాహుల్‌ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పేరు ‘శ్రీరెడ్డి దొరికిపోయింది’. మానవ మృగాలకు అనేది ఉప శీర్షిక. 


నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ ను బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. అమ్మాయిల పై జరుగుతున్న అఘాయిత్యాల కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా ఇదని తెలుస్తోంది. ఈ సినిమాతో శ్రీరెడ్డి కి ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ.. టైటిల్‌ లో ఆమె పేరును వాడటంతో ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.


పోస్టర్ కూడా చాలా ఆసక్తి కరంగా ఉంది. పోస్టర్ లో ఒక అమ్మాయి చేతిలో కత్తి, ఆమె ముఖం పై రక్తపు మరకలు, ఆమె ముఖంలో కోపం చూస్తుంటే ఇదేదో మగ మృగాల పై రివేంజ్ స్టోరీలా అనిపిస్తోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్వంత్‌ మూవీస్‌ పతాకం పై డి. వెంకటేష్‌ నిర్మిస్తున్నారు. గణేశ్‌ రాఘవేంద్ర సంగీతన్ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: