మహేష్ బాబు, రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలవ్వనుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, పాటలు.. అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన కూడా వచ్చింది. ఈ చిత్రం ద్వారా దశాబ్దం తర్వాత సినీ ప్రేక్షకుల ముందుకు మళ్లీ రాబోతున్నారు విజయశాంతి. ఈ చిత్ర టీజర్ చూసిన తర్వాత సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయ్ అని అర్థమవుతుంది.


ఇకపోతే, ప్రస్తుతం రెండు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొదటి వార్త ఏంటంటే.. సరిలేరు నీకెవ్వరు చిత్రం టైటిల్ ని ఒక పాత సినిమా నుంచి కాపీ కొట్టారని నెటిజన్లు చులకనగా మాట్లాడుకుంటున్నారు. అయితే, మహేష్ బాబు సినీ చరిత్రలో అతడు నటించిన సినిమాల టైటిల్స్ మాత్రం అన్ని కొత్తగానే ఉన్నాయి. కానీ సరిలేరు నీకెవ్వరు టైటిల్ మాత్రం మరొక సినిమా నుంచి కాపీ కొట్టడంతో అతని సినీ చరిత్రలో మొదటిగా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది.



ఈ టైటిల్ ని ఏ సినిమా నుండిి తీసుకున్నారంటే.. ఎన్టీఆర్్న్ నటించిన 'కంచుకోట'. ఈ కంచుకోట సినిమాలో ఒక పాట సరిలేరు నీకెవ్వరు అని    మొదలవుతుంది. ఇదే పాటలోని 'సరిలేరు నీకెవ్వరు' అనే పల్లవిని మహేష్ బాబు రాబోయే సినిమాకు శీర్షికగా పెట్టారు చిత్రబృందం. అలాగే, 2 గంటల 48 నిమిషాలు సాగే 'సరిలేరు నీకెవ్వరు' అల్లు అర్జున్ తీసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం కథ లాగానే ఉందని నెగటివ్ టాక్ గట్టిగానే వినపడుతుంది.

 


ఇంకొక వార్త ఏంటంటే.. మహేష్ బాబు ఒక దివ్యాంగుడైన అభిమానిని చాలా ఆప్యాయతగా పలకరిస్తారు. దాంతో, ఆ అభిమాని చాలా సంతోషపడతాడు. ప్రస్తుతం మహేష్ బాబు ఈ అభిమాని పట్ల చూపించిన ప్రేమ అందర్నీ కట్టిపడేస్తుంది. అలాగే అందరూ మహేష్ బాబుని పొగుడుతున్నారు. అయితే, ఒక వారం క్రితం అభిమానులని ఘోరంగా ట్రీట్ చేశాడన్న నెటిజెన్ల విమర్శలకు ఈ సంఘటనతో చెక్ పెట్టేసాడు మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: