ఇటీవల సుధీర్, ధన్య బాలక్రిష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీ విడుదలైంది. ఈ సినిమా హిట్ అంటూ సక్సెస్ మీట్‌ లు నిర్వహించినా.. బయట థియేటర్స్‌ లో మాత్రం సుధీర్ సినిమా జాడ కనిపించడం లేదు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సుధీర్, ధన్య బాలక్రిష్ణలు తమ తొలి చిత్రాలకు రెమ్యునరేషన్ ఎంత అనే తదితర విషయాలను తెలియజేశారు. ఈ సినిమాకు తమ రెమ్యునరేషన్ చాలా తక్కువే అని అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత తొలి సినిమాకు తనకు అసలు డబ్బులే ఇవ్వలేదన్నారు సుధీర్. ఇక రెండో సినిమాకి కేవలం 1500 మాత్రమే ఇచ్చారన్నారు.


టీవీలతో జబర్దస్త్, పోవే..పోరా, ఢీ షోలు చేస్తున్నా. ఒక వైపు సినిమా, మరోవైపు టీవీ షోలు ఉన్నంత మాత్రాన బ్యాలెన్సింగ్ అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేం. ఎందుకంటే నేను చేసింది ఒక సినిమానే. పైగా టీవీ షోలు నెలలో 10 రోజులు ఉంటాయి. మిగిలిన రోజులు సినిమాపై పెట్టొచ్చు. ఇవి రెండూ డిఫరెంట్ దారులు. ఈ రెండు రూట్లలో ఒకటే ఎంచుకోమని అంటే ఖచ్చితంగా జబర్దస్త్‌నే ఎంచుకుంటా. ఎందుకంటే నా బేస్ అదే.


నేను హీరో అయినా జబర్దస్త్ చేశా. జబర్దస్త్ లేకపోతే సుధీర్ లేడు. సుడిగాలి సుధీర్ అనే పేరుతో సాఫ్ట్ వేర్ సుధీర్ వచ్చాడు. ఇప్పుడు నాకు టీవీ షోల ద్వారా ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి ఈ బేస్‌ని వదిలేసి సినిమాలే చేస్తానని చెప్పను. అలాగే సినిమాల్లో బిజీ స్టార్‌ గా అయిన తరువాత మళ్లీ వచ్చి టీవీ షోలు చేస్తుంటే.. మీరు టీవీ షోలు చేస్తారా? సినిమాలు చేస్తారా? అంటే సినిమాలు చేస్తా అని చెప్తా. ఎందుకంటే అప్పుడు నా రూటు సినిమాలు. ప్రస్తుతానికి నా రూటు టీవీ షోలు. నా రూట్‌ని ఎప్పుడూ వదల్లేను. జబర్దస్త్ ఉన్నంత కాలం నేను ఉంటా.


సుధీర్‌తో పాటు ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ధన్య కూడా తన రెమ్యునరేషన్ వివారాలను తెలియజేశారు. నా రెమ్యునరేషన్ చెప్పకూడదని ఏం లేదు కాని.. నేను స్టార్టింగ్‌లో రోజుకి 4000 తీసుకున్నా. అయితే ఇప్పుడు రేంజ్ పెరిగింది. అనుకోకుండానే మనీ గ్రోత్ ఉంటుంది. రెమ్యునరేషన్ విషయాన్ని పక్కన పెడితే.. నటన పరంగా ప్రతిరోజు ఒక లెసన్ ఉంటుంది. యాటిట్యూట్ చూపించకుండా హీరోయిన్ అనే పొగరు లేకుండా మనం ఎంత కింద ఉంటే.. సక్సెస్ అంత పైకి లేపుతుంది. కింద ఉంటేనే మనం నేర్చుకోవడానికి ఉంటుంది. ఆకాశంలో ఉంటే ఎదుగుదల కూడా అలాగే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: