టాలీవుడ్ లో టాప్ హీరోలు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాల విడుదల తేదీపై సస్పెన్స్ వీడింది. ఈ రెండు సినిమాలు జనవరి 11నే విడుదల కానున్నాయనే వార్తలపై క్లారిటీ ఇస్తూ రెండు చిత్రాల నిర్మాతలు శనివారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు. థియేటర్ల సర్ధుబాటు విషయంలో నిర్మాతల మధ్య రాజీ కుదరడంతో ఎట్టకేలకు విడుదల తేదీలను ప్రకటించారు.


ఫైనల్‌ గా నిర్మాతలు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం. సమస్యకు పరిష్కారం దొరికింది. ముందుగా అనుకున్నట్టుగానే ‘సరిలేరు నీకెవ్వరు’ 11న, ‘అల.. వైకుంఠపురములో’ 12న విడుదల చేస్తున్నాం. రిలీజ్‌లో ఎలాంటి మార్పులేదని క్లారిటీ ఇచ్చారు. ఈ పెద్ద సినిమాలతో పాటు మరో రెండు 'దర్బార్', 'ఎంత మంచి వాడవురా' కూడా విడుదల కానున్నాయి. గత సంక్రాంతికి ఒకేసారి నాలుగు పెద్ద చిత్రాలు విడుదలై విజయాన్ని సాధించాయి. ఈసారి కూడా అన్ని సినిమాలు విజయవంతం కావాలని కోరుతున్నా.


సినిమాల  విడుదల తేదీలపై సమస్య వచ్చింది. నిర్మాతల మధ్య మిస్ అండర్ స్టాండింగ్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు వాటిని షాట్ ఔట్ చేసి సినిమాలను ప్రొటెక్ట్ చేయడమే నా టార్గెట్. రెండు పెద్ద సినిమాలను ఒకేరోజు వేసుకుంటే రెవెన్యూ రాదు. ఆ సినిమాకి ఈ సినిమాకి కూడా రెవెన్యూ రావాలనే ఈరోజు అందరితో మాట్లాడాం అంటూ చెప్పుకొచ్చారు.


సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్షియల్ మ్యాటర్ చాలా ముఖ్యం. రెవెన్యూని ఎలా తీసుకురావాలనేది మా ఆలోచన. ఒక సినిమా ద్వారా వీలైనంత డబ్బులు తీసుకురావాలి. ఒకే రోజు రెండు సినిమాలు విడుదలైతే రెవెన్యూ ఆగిపోద్ది. ప్రతి సినిమా ఆడాలనే తీస్తాం. రీజన్స్ ఏదైనా సరే.. చివరికి మంచి పరిష్కారం దొరకడాన్ని ఆహ్వానించాలి. దీని పై అందరూ పాజిటివ్‌ గా రెస్పాండ్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యారని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: