కన్నీళ్లు పెట్టించిన ఛపాక్ ఆడియో ఫంక్షన్...!!!

 

మగాడనే కొందరి మృగాల దాడిలో బలై పోయి, యాసిడ్ దాడి వలన సగానికి పైగా ముఖం కాలిపోయిన లక్ష్మీ అగర్వాల్ జీవిత గాధతో తెరకెక్కుతున్న చిత్రం  ఛపాక్. లక్ష్మీ జీవిత గాధని తెరకెక్కించి సమాజానికి ఓ సందేశం ఇవ్వాలని తీస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రంలో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే సుముఖత వ్యక్తం చేసిన నాటి నుంచీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరికి కళ్ళలో నీళ్ళు తిరగక మానవు. అంతగా ఈ సినిమా ట్రైలర్ అందరిని కదిలించింది. అయితే

 

తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లాంచ్ ని ముంబై లో ఏర్పాటు చేసింది ఈ చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో దీపికా తో పాటు భాదితురాలు లక్ష్మి అగర్వాల్, సినిమా డైరెక్టర్ మేఘనా గుల్జార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఈ సినిమాలో పాటని పాడుతున్న క్రమంలో స్టేజిపై ఉన్న లక్ష్మీ ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది..దాంతో

 

పక్కనే ఉన్న దీపిక సైతం ఆమెని చూసి కన్నీటి పర్యంతమయ్యి లక్ష్మిని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా సభా వేదిక అంతా సైలెంట్ అయ్యిపోయింది. ఈ ఘటనకి సంభందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీపికా ఈ సినిమాకి ముందు నుంచీ ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యిందని, గతంలో కూడా ఎన్నో సందర్భాలలో దీపిక బహిరంగ వేదికలపైనే కన్నీటి పర్యంతమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ విషయంపై స్పందించిన ఆమె సన్నిహితులు సహజంగానే దీపికా ఎంతో సెన్సిటివ్ పర్సన్ అని, చిన్న చిన్న విషయాలని సైతం తట్టుకోలేదని  అంటున్నారు

 

మరింత సమాచారం తెలుసుకోండి: