జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు మాస్ మాహారాజ్ రవితేజ. ఇటీవలే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిసాస్టర్ తన ఖాతాలో వేసుకున్న ఆయన ప్రస్తుతం 'డిస్కో రాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం మేరకు రవితేజ మరో సినిమాకి సైన్ చేశారని తెలుస్తోంది. త‌మిళంలో సూపర్ డూపర్ హిట్ సాధించిన చిత్రం 'విక్ర‌మ్‌వేద‌'. ద‌ర్శ‌కద్వ‌యం పుష్క‌ర్‌, గాయ‌త్రి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ విక్ర‌మ్‌గా మాధ‌వ‌న్‌ నటించగా, గ్యాంగ్‌స్ట‌ర్ వేద పాత్ర‌లో విజ‌య్‌సేతుప‌తి న‌టించారు. ‘డాన్‌శీను’,’బ‌లుపు’ వంటి రెండు సెన్సేష‌న‌ల్ హిట్‌ చిత్రాల త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ, దర్శకుడు గోపీచంద్ మ‌లినేని కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ మూవీ `క్రాక్‌`. పవర్ ఫుల్ టైటిల్ తో పాటు,ర‌వితేజ మాస్ లుక్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు.

 

ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైంది. ర‌వితేజ‌, శృతిహాస‌న్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.  స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. కోలీవుడ్ యాక్ట‌ర్స్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి `మెర్స‌ల్‌`, `బిగిల్‌` వంటి సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందించిన జి.కె.విష్ణు సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

 

ఇక ఇదిలా ఉంటే సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `ద‌ర్బార్` చిత్ర ద‌ర్శ‌కుడు మురుగుదాస్ ఈరోజు ర‌వితేజ క్రాక్ షూటింగ్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళారు. ఇటీవ‌లె ద‌ర్బార్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హైద‌రాబాద్ వ‌చ్చిన ఆయ‌న గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న క్రాక్ షూటింగ్ వ‌ద్ద‌కు వెళ్ళి. అక్క‌డ చిత్ర యూనిట్‌తో కాసేపు స‌ర‌దాగా గ‌డిపారు.  గ‌తంలో గోపీచంద్ మురుగుదాస్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. బ‌హుశా ఆ ప‌రిచ‌యం కొద్దీ అక్క‌డ‌కు వెళ్ళి ఉంటారు. అయితే మురుగుదాస్ నెక్స్‌ట్ సినిమా అల్లుఅర్జున్‌తో ఉంట‌ద‌ని స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: