స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా అలవైకుంఠపురములో సినిమాపై ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి అనే చేప్పాలి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్నట్లు సమాచారం. తన గత సినిమాల మాదిరిగా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఆకట్టుకునే వినోదం, పంచ్ డైలాగ్స్ తో దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని తీస్తున్నట్లు సమాచారం. హారిక హాసిని  క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ల పై నిర్మితం అవుతున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, 

 

టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక సామజవరగమనా, రాములో రాములా సాంగ్స్ అయితే 100 మిలియన్ పైగా వ్యూస్ దక్కించుకుని సరికొత్త రికార్డుని నెలకొల్పడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ లో బుట్ట బొమ్మ అనే సాంగ్ కూడా ఇటీవల విడుదలై, శ్రోతలను విశేషంగా అలరించింది. ఇక ఈ సాంగ్ మేకింగ్ వీడియో ఒకటి నేడు లీక్ అయి ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. ఈ సాంగ్ లో బన్నీ, పూజ ఇద్దరూ కూడా మంచి అలరించే స్టెప్స్ తో, లేటెస్ట్ ట్రెండీ స్టైల్ అవుట్ ఫిట్స్ తో అదరగొట్టగా, సెట్టింగ్ కూడా మోడరన్ లుక్ లో అదిరిపోయింది. 

 

అయితే ఈ విధంగా సాంగ్ వీడియో లీక్ కావడంతో అల మూవీ టీమ్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిజానికి ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి, వందలాది మంది శ్రమ పడి ఒక సినిమాను తెరకెక్కిస్తే, దానిని ఈ విధంగా కేవలం ఒక ఫోన్ తో వీడియో తీసి లీక్ చేయడం శ్రమ దోపిడీ అని, ఇటువంటి తప్పుడు పనుల వలన మున్ముందు నిర్మాత, దర్శకుల్లో భయాలు మరింతగా పెరుగుతాయని, కావున ఇకపై ఎవరూ కూడా ఇటువంటి పనులకు పాల్పడవద్దని పలువురు సినీ వర్గాల వారు కోరుతున్నారు. మరి ఇటువంటి లీకులు ఇకనైనా ఆగుతాయో లేదో చూడాలి. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 12న రిలీజ్ కాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: