రజినీకాంత్ దర్బార్ సినిమా ఈనెల 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  మురుగదాస్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి.  15 ఏళ్ల నుంచి అనుకుంటూ ఉంటె ఇప్పటికి మురుగదాస్ తో సినిమా చేసే అవకాశం దక్కింది రజినీకాంత్ కు.  ఈ సినిమాలో రజినీకాంత్ యాక్షన్ ను చూడబోతున్నారట.  రజినితో సినిమా అంటే ఆ దర్శకుడికి అదృష్టం అని చెప్పాలి.  అవకాశాన్ని దర్శకుడు వినియోగించుకునే దాన్ని బట్టి అతని ఫ్యూచర్ ఉంటుంది.  


ఆదిత్య ఆరుచలంగా ఇందులో కనిపిస్తున్నారు.  ఇప్పటికే సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇందులో పూర్తిగా యాక్షన్ నెలకొన్ని ఉన్నది.  యాక్షన్ తో దర్బార్ నిండిపోతుంది.  ఇకపోతే  సినిమాలో పోలీసులు ఓ కేసును సీరియస్ గా తీసుకొని డీల్ చేసే సమయంలో ఎదురైన అనుభవాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.  


సినిమా పరంగా సాంగ్స్ కూడా హైలైట్ గా నిలిచాయి.  అనిరుద్ ఇప్పటికే బెస్ట్ సాంగ్స్ అందించారు.  నయనతార ఈ సినిమాతో మరోసారి రజినీకాంత్ తో కలిసి నటించే అవకాశం దక్కింది.  అప్పుడెప్పుడో చంద్రముఖి సినిమాలో కలిసి నటించారు.  మరలా ఇప్పుడు నటిస్తున్నారు.  ఇక మురుగదాస్ సినిమాను తీసిన విధానం నచ్చుతుందని అంటున్నారు.  అందుకే ఈ దర్బార్ ప్రీ రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించారని ప్రచారం జరుగుతున్నది.  


దర్బార్ సినిమా ప్రమోషన్స్ కూడా అదరగొడుతున్నారు.  తమిళ్, తెలుగుతో పాటుగా అటు హిందీలోనూ భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు.  సినిమా నిలబడింది అంటే కోట్ల రూపాయలు నిర్మాతల జేబుల్లోకి వెళ్ళినట్టే.  మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో చూడాలి.  జనవరి 9 న ఈసారి రజినీకాంత్ తమిళనాడులో సోలోగా వస్తున్నారు.  అది ప్లస్ పాయింట్ అయ్యింది.  సినిమాను మొదలు పెట్టి తక్కువ రోజుల్లోనే ఫినిష్ చేయడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: