యాంకర్ సుమ ఈ మధ్య వార్తల్లోకి తెగ ఎక్కుతున్నారు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాటలు తెగ వైరల్ అయిపోయిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆమె వాక్చాతుర్యం వలన ప్రతి ఒక్క పెద్ద సినిమా కార్యక్రమాలకు వ్యాఖ్యాత బాధ్యతలను ఆమెకి అప్పగిస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' చిత్ర మ్యూజికల్ కన్సర్ట్ లో కూడా ఆమెనే వ్యాఖ్యాత గా బాధ్యతలను వ్యవహరించింది.


అయితే, ఈవెంట్ కు విచ్చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వేదికపైకి వచ్చి.. మొట్టమొదటిగా సంగీత దర్శకుడు తమన్ ను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. ఆ తర్వాత సిద్ శ్రీరామ్ ని హత్తుకొని తనని వెన్ను తట్టారు. ఈ ప్యూర్ ఆప్యాయతతో సింగర్ సిద్ శ్రీరామ్ కొంచెం భావోద్వేగానికి గురి అయినట్లు కనిపించింది.



ఇకపోతే, త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్పీచ్ ని మొదలు పెడుతూ.. ఇలా మాట్లాడారు.. 'సుమ గారు నేను మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. రండి.. (సుమ: ఏమిటి, సార్). నాకంటే వయసులో చిన్నవారు కాబట్టి మీరు.. మీకు నా అభినందనలు. ఇంటికెళ్ళి దిష్టి తీయించుకోండి. మా అందరి దిష్టే తగిలింది మీకు. (సుమ: థాంక్యు, సార్). మాయాబజార్ లో నేత్రోత్సవం ఉంటుంది. మాయాబజార్‌ సినిమాలో నేత్రోత్సవంగా ఉందని ఎస్వీరంగారావు చెబుతారు. అలా ఈ మ్యూజిక్ ఈవెంట్‌లో ఎంతో నేత్రోత్సవంగా యాంకరింగ్ చేశారు మీరు. థాంక్యు.' అని అన్నారు.


మరొక వైపు అల వైకుంఠపురములో చిత్ర థియరిటికల్ ట్రైలర్ విడుదలై యూట్యూబ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన పది గంటల్లోనే 30 లక్షల మంది వీక్షకులు చూశారంటే ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో ఈజీగా అర్థమవుతుంది. ఇందులో డైలాగ్.. ' దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు వాళ్ళకి(ఆడవారికి)', అందర్నీ కట్టిపడేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: