తనతోపాటు ప్రతి మెగా హీరో సినిమాకి తెగే మొదటి టికెట్ మెగాస్టార్ అభిమానిదే అని చెప్పిన వ్యక్తి అల్లు అర్జున్. చిరంజీవి గారి మెగా క్రేజ్ కు బూస్టప్ ఇచ్చి మాకు మంచి దారి చూపించారు పవన్ కల్యాణ్ అని చెప్పిన వ్యక్తి కూడా అల్లు అర్జునే. కానీ.. ఇప్పుడు మెగా హీరోలు, అల్లు హీరోలు వేరు వేరుగా ఉంటున్నారనే అనుమానాలకు స్వయంగా అల్లు అర్జునే హింట్ ఇస్తున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. అల.. ఫంక్షన్ లో పవన్ ప్రస్తావన తీసుకురాకపోవడమే ఇందుకు కారణం.

 

 

చెప్పను బ్రదర్ అంటూ సరైనోడు ఫంక్షన్ లో చెప్పి పెద్ద వివాదానికి తెర తీశాడు బన్నీ. అప్పటి నుంచీ బన్నీని పవన్ ఫ్యాన్స్ మామూలుగా టార్గెట్ చేయలేదు. దువ్వాడ జగన్నాధం సినిమాపై ఆ ఎఫెక్ట్ భారీగా పడింది. అయితే.. తర్వాత రోజుల్లో ఓ ఫిల్మ్ చాంబర్ లో, పవన్ ఎన్నికల ప్రచారంలో బన్నీ హాజరై పవన్ మద్దతు పలికాడు. సోషల్ మీడియాలో కూడా పవన్ గొప్పదనాన్ని పొగిడాడు. అంతా సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో నిన్న అల.. వైకుంఠపురంలో ఫంక్షన్ లో పవన్ ఫ్యాన్స్ పవన్ గురించి చెప్పాలని ఎంత అడిగినా కనీసం పవన్ పేరు ప్రస్తావించకపోవడం పవన్ ఫ్యాన్స్ కు ఇబ్బంది కలిగించింది.

 

 

ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలకు సాయి ధరమ్ తేజ్ మేమంతా ఒకటే.. మనమంతా మెగా అభిమానులమే అనే అంటున్నాడు. ఓవైపు మెగా హీరోలతో బన్నీకి పోటీ ఉందని ఎవరికి వారు ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా చిరంజీవి, పవన్ వేరు వర్గాలైపోయారు. మరి ఈ నేపథ్యంలో ‘నేను ఎప్పటికీ చిరంజీవి గారి అభిమానినే’ అన్న బన్నీ వ్యాఖ్యలు రాజకీయంగానా.. లేక కుటుంబాల మధ్య ఏమన్నా జరుగుతోందా అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: