సినీ పరిశ్రమలో కొంతమందికి అతి తక్కువ కాలంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాంటి వారిలో సింగర్  రాహుల్ సిప్లిగంజ్ ఒకరు.  చిన్న చిన్న స్టేజీలపై సాంగ్స్ పాడుతూ వచ్చిన రాహూల్ తర్వాత సినిమాల్లో పాడటం మొదలు పెట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ టైటిల్ సాంగ్ తో  రాహుల్ సిప్లిగంజ్ పేరు ఒక్కసారే పాపులర్ అయ్యింది.  దాంతో ఆయన పాడిన ప్రైవేట్ ఆల్బామ్స్ కి కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఓ వైపు  సినిమాల్లో పాటలు పాడుతూనే మ్యూజికల్ షోస్‌‌తో రచ్చ రచ్చ చేస్తున్నాడు.  ఆ తరువాత  'బిగ్ బాస్ 3' చివరి వరకు తన స్టైల్లో ఆడియన్స్ ని మెప్పిస్తూ.. ఓట్లు రాబట్టాడు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా నిలిచారు.  అయితే  తను బిగ్ బాస్ 3 విజేతగా నిలిస్తే, వచ్చే డబ్బుతో తల్లిదండ్రుల కోసం ఒక ఫ్లాట్ తీసుకుంటానని ఆయన చెప్పాడు.  

 

ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత తన క్లోజ్ ఫ్రెండ్.. బిగ్ బాస్ బ్యూటీ పునర్నవితో చెట్టాపట్టాలేసుకుని బయట కనిపించి హల్ చల్ చేశారు. అయితే వీరి మద్య అదేదో నడుస్తుందని చాలా మంది కామెంట్స్ చేయడంతో.. మా బంధం బెస్ట్ ఫ్రెండ్ కంటే బలమైనదే తప్ప ఇంకేం లేదంటూ క్లారిటీ ఇచ్చారు ఈ ఇద్దరు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఓ ఖరీదైన బెంజ్ కారు కొని రిచ్‌ సెలబ్రిటీగా మారారు. 50 లక్షల ఖరీదు చేసే బెంజ్ కారు కొనేసి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే దీనిపై కొంత మంది నెటిజన్లు నెగిటీవ్ గా కామెంట్స్ చేశారు.  

 

మీ తల్లిదండ్రులకు సొంత ఇల్లు తీసుకుంటానని చెప్పి .. ఖరీదైన కారు తీసుకుంటావా? అంటూ ఆయనను నెటిజన్లు ప్రశ్నించారు. తాజాగా దీనిపై స్పందించిన రాహూల్ సిప్లిగంజ్ "ఆల్రెడీ ఫ్లాట్ తీసేసుకున్నాను .. అది చేతికి రావడానికి ఏడు నెలలు పడుతుంది. ఈలోగా కారుకి కూడా గాలమేశాను" అంటూ నెటిజన్లను కూల్ చేశాడు. అంతే కాదు తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోని షేర్ చేశారు రాహుల్ సిప్లిగంజ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: