సెన్షేషనల్ అండ్ క్రియోటివ్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్-నయనతార హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా 'దర్బార్'. ఇప్పటికే చెన్నైయ్, హైదరాబాద్ సహా పలు చోట్ల ప్రీమియం షోలు పడ్డాయి. సినిమా సూపర్ హిట్ అన్న టాక్ వచ్చేసింది. అంతేకాదు 13 ఏళ్ళ తర్వాత దర్బార్ లో సినిమాలో రజినీకాంత్ పోలీస్ గెటప్ ఆయన మార్క్ నటన అద్భుతం అని తలైవా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముఖ్యం గా చెన్నై లో ఫ్యాన్స్ ఉత్సాహం అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 9 ఏళ్ళ నుంచి తమ అభిమాన హీరో, తలైవా రజినీకాంత్ ను తన ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో మురగదాస్ అలా చూపించారని ఈ ఏజ్ లో కూడా రజిని యూత్ హీరోగా చెలరేగిపోయారని నానా హంగామా చేస్తున్నారు.

 

ఇక ఫస్ట్ హాఫ్ కంప్లీట్ ఎంటర్‌టైనుంగ్ అండ్ రొమాంటిక్ గా సాగిందట. ముఖ్యంగా ఇంటర్వల్ ముందు వచ్చే సీన్స్ అండ్ ట్విస్ట్ అదిపోయి సినిమాకు గ్రిప్పింగ్ తెచ్చాయని ఫ్యాన్స్ అంటున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి గ్రాండ్ ఎంట్రి తో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందట. ఈ సీన్స్ రజనీ స్టైల్ కి జనాలు అరుపులు, కేకలు, చప్పట్లు, విజిల్స్ తో థియోటర్స్ దద్దరిల్లిపోతున్నాయట. ఇక సెకండ్ హాఫ్ లో పోలీసులకు ఛాలెంజింగ్, యాక్షన్, సెంటిమెంట్ తో సూపర్ అని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇక ముదరగదాస్ స్క్రీన్ ప్లే సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్ళిందని ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఆడియన్స్ ని కంప్లీట్ గా ఎంటర్‌టైన్ చేశారని మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ రేంజ్ ఉంటుందై సినిమా అని ఊహించలేదని ఫ్యాన్స్ ఆగా ఎగ్జైట్ అవుతున్నారు. సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ అని జనాలు బాగా నమ్మకం కలిగింది.

 

అంతేకాదు దర్బార్ కి కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో థియేటర్లకు వద్ద జనాల సందడి బాగా పెరిగిపోయింది. రజిని సినిమా తో మళ్ళీ పాత రజనీని చూశామని ఫ్యాన్స్ తెగ సమబర పడుతున్నారట. అంతేకాదు వరుసగా కబాలి, కాలా, పేట ఫ్లాపయినప్పటికి ఆ ఇంపాక్ట్ అసలు కాస్త కూడా దర్బార్ మీద పడలేదని అంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకి థియోటర్స్ సరిపోవని ఇంకా ప్రంచాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ మాట అటు మహేష్ బాబు కి ఇటు అల్లు అర్జున్ కి షాకిస్తోంది. ఎందుకంటే 11 న మహేష్ సరిలేరుతో 12 న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో సిద్దంగా ఉన్నారు. అంతేకాదు ఈ ఇద్దరు రజనీ సినిమాకి అంత లేదన్నట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రజనీకే థియోటర్స్ ఎక్కువగా కావాలట.  

మరింత సమాచారం తెలుసుకోండి: