క్రిష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాలో హీరోయిన్ గా కనిపించిన మెహ్రీన్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె నటించిన మహానుభావుడు, రాజా ది గ్రేట్  చిత్రాలు ఆమె కెరీర్లో మంచి విజయాలు సాధించాయి. అయితే ఈ సినిమాలన్నింటిలో ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. నటనపరంగా మెహ్రీన్ కి చాలా తక్కువ మార్కులే పడ్డాయి. పోయిన ఏడాది సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 సినిమా ఆమెలోని నటనని బయటకి తీసుకువచ్చింది.

 

ఈ సినిమాలో ఆమె పండించిన హాస్యం బాగా వర్కౌట్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అయితే దాదాపు సంవత్సరం తర్వాత మెహ్రీన్ నుండి మరో రెండు చిత్రాలు విడుదల అవుతున్నాయి. అందులో ఒకటి తెలుగులో కల్యాణ్ రామ్ సరసన ఎంత మంచి వాడవురా కాగా, మరోటీ తమిళ స్టార్ నటించిన పటాస్ కూడా ఉంది.

 

అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం విశేషం. తెలుగులో ఎంత మంచి వాడవురా చిత్రం జనవరి ౧౫ వ తేదీన విడుదల అవుతుండగా, పటాస్ తమిళంలో అదే రోజు విడుదల అవుతుంది. ఒకే హీరోయిన్ గా సంబంధించిన రెండు చిత్రాలు ఒకే తేదిన విడుదల అవడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అవుతుంది. అయితే ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

సంక్రాంతి కానుకగా వస్తున్న ఎంత మంచి వాడవురా చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి ప్రేక్షకులకి బాగ నచ్చుతుందనే టాక్. ఇక పటాస్ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలు హిట్ అయితే మెహ్రీన్ కెరీర్ సెట్ అయినట్టే అనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: