అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈ రోజు విడుదల అయింది. ఈ సినిమా మీద విడుదలకి ముందు నుండి ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలని అందుకుందా లేదా అన్నది పక్కన పెడితే అనిల్ రావిపూడి సృష్టించిన మేనరిజమ్స్ గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సాధారణంగ ప్రతీ డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది. అది రచయిత నుండి డైరెక్టర్ గా మారిన దర్శకుడికి మరి కాస్త ఎక్కువ ఉంటుంది.

 

రచయిత నుండి డైరెక్టర్ గా మారిన దర్శకులు సినిమాల్లో మాటల ద్వారా, పాటల్లో సాహిత్యం ద్వారా తమ మార్క్ ఉండేలా చూసుకుంటారు. అనిల్ రావిపూడి కూడా అందుకు అతీతుడేమీ కాదు. అనిల్ రావిపూడి సినిమాల్లో కావాల్సినంత వినోదం ఉంటుందని అందరికీ తెలుసు.. ఆయన చేసిన సినిమాల్లో నవ్వు అనేది ప్రధాన ఫ్యాక్టర్ గా ఉంటుంది. అలాగె అనిల్ రావిపూడి చాలా కొత్త కొత్త మేనరిజమ్స్ ని సృష్టించాడు.

 

రాజా ది గ్రేట్ సినిమాలో వీరి ముఖ చిత్రాలేంటి దగ్గర నుండి అదే సినిమాలో శ్రీనివాస్ రెడ్డి రవితేజ ల లాఫింగ్ కూడా ఒక మార్క్ గా నిలిచిపోయింది. అలాగే ఎఫ్ 2 సినిమాలో వెంకీ ఆసన్ తో పాటు అంతేగా అంతేగా అన్న డైలాగ్ కూడా బాగా పేలింది. ఇలా ఒక్కో సినిమాకి ఒక్కో మేనరిజమ్ ని సృష్టించుకుంటూ వస్తున్న అనిల్ రావిపుడి సర్లేరు నీకెవ్వరు సినిమాలోనూ అలాంటి మేనర్జమ్స్ పెట్టాడు. 

 

ప్రస్తుతం సినిమాలో అవి హైలైట్ గా నిలిచాయి. అబ్బబ్బబ్బబ్బా ... నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్... నా వేలు మీద చుక్క.. నీకర్థమవుతుందా లాంటి డైలాగులు బాగా పేలాయి. ఈ సినిమాకి ఈ మేనరిజమ్స్ అట్రాక్షన్ గా మారాయి. ట్రైలర్ లోనే ఈ మాటలతో నవ్వించిన అనిల్ సినిమాలో మరింత బాగా నవ్వించగలిగాడు. మరి ఆ మేనరిజమ్స్ టిక్ టాక్ ద్వారా ఫేమస్ అవకముందే సినిమా చూసి నవ్వుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: