అల్లు అర్జున్ కథనాయకుడిగా పూజా హెగ్డే కథనాయకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల.. వైకుంఠపురములో. ఎన్నో అంచనాల నడుమ విడుదల అవుతున్న రేపు విడుదల అవుతుంది. అయితే ఈ సినిమాకు ప్రేమోషన్స్ పనిలో ఉన్న బన్నీ ఓ సంచలన విషయాన్నీ బయట పెట్టాడు. అది ఏంటంటే ఓ పాత్ర అందులో హైలెట్ అంట.     

 

ఆ పాత్ర ఏంటి అనుకుంటున్నారా ? అదేనండి తండ్రి క్యారెక్టర్ హైలెట్ అంట. అల వైకుంఠపురములో తండ్రి పాత్రలో యాక్టర్ మురళి శర్మ నటించారు. ఈ పాత్ర సినిమాకు ముఖ్యం అనుకున్నాం కానీ ఇదే హైలెట్ అనేది ఇప్పుడే తెలుస్తుంది. ఇటీవలే సినిమా ప్రేమోషనల్ ఇంటర్వ్యూలో బన్నీ ఇలా చెప్పుకొచ్చాడు... అల..వైకుంఠపురములో సినిమాకు మురళి శర్మ గారి పాత్ర ఒక బ్యాక్ బోన్ లాంటిది అంటూ చెప్పుకొచ్చారు.   

 

దీంతో బన్నీ ఇంత స్ట్రాంగ్ చెప్పాడంటే ఆ పాత్ర చాల స్ట్రాంగ్ అయి ఉంటుంది అని అర్థం అవుతుంది. అంతేకాదు ఈ సినిమాలో మన ఓల్డ్ అక్కినేని హీరో సుశాంత్ పాత్ర కూడా సినిమాలో చాలా కీలకమైనది అని అయన చెప్పారు. సినిమాలో ఎక్కడ ఆడియన్స్ హర్ట్ కాకుండా సినిమాలో అందరికి మంచి ఫీల్ వచ్చేలా సినిమా రూపొందినట్టు చెప్పారు. 

 

కాగా ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు. గీత ఆర్ట్స్ - హారిక హాసిని బ్యానర్స్ లో చినబాబు - అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్వహించారు. ఈ సినిమాలో ఒక్క హీరోయిన్ కాదు ఇద్దరు. ఒకరు పూజా హెగ్డే అయితే మరొకరు నివేత పెతు రాజ్. ఇప్పటికే విడుదల టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోతో అల్లు అర్జున్ అభిమానులు అంత భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: