సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా సక్సెస్ అవ్వాలంటే ముందుగా తన ప్రతిభను, తనలోని సత్తాను, కసిగా చూపించాలి. సినిమాను కూడా అదే రేంజ్‌లో తెరకెక్కించాలి. ఇక నటీమణుల ఎంపిక కూడా ఒక్కోసారి సినిమా ఫ్లాపులను, హిట్‌లను నిర్ణయిస్తుంది. ఒక్క సినిమా హిట్టుపడిందా అవకాశాలు వరసపెట్టి ఇంటి ముందు నిలుచుంటాయి.

 

 

ఇకపోతే ప్రతి సినిమాలో దర్శకుడు తన ప్రత్యేకతను తన మ్యానరిజం తో చూపిస్తాడు. అలా వచ్చిన మ్యానరిజం ఎన్నో చిత్రాలను హిట్ చేసింది, ఫ్లాపులు అందించింది. ఏది ఏమైన ఆ మ్యానరిజం తాలుకు భావం ప్రేక్షకుల మనుసుల్లో ఎప్పటికి నిలిచిపోతుందనడానికి నిదర్శనంగా కొంతమంది దర్శకులను చెప్పవచ్చు. కానీ పదే పదే అదే మ్యానరిజంతో సినిమాలు తీస్తే పాపం ప్రేక్షకుడు కూడా ఎంతవరకని భరిస్తాడు.

 

 

ఇకపోతే పరభాషల సంగతి ఎలా ఉన్నా మన తెలుగులో ఒక్కో దర్శకుడికీ ఒక్కో మార్క్ ఉంటుంది. ఆ మార్క్ ఏర్పడే వరకూ ఏమో కానీ అది ఏర్పడిందంటే దానిని నిలబెట్టుకోడానికి చేయని ప్రయత్నాలు ఉండవు. అంటే రాఘవేంద్ర రావు సినిమాల్లో హీరోయిన్ల బొడ్డుపై పూలు, పళ్ళు విసరడం, ఆర్ నారాయణ మూర్తి సినిమాలో విప్లవ పాటలు, కొరటాల శివ సినిమాల్లో ఒక మెసేజ్, పూరి సినిమాల్లో హీరో బేవార్స్ గా తిరగడం లాంటివి ఈ కోవలోకే వస్తాయి. వీటిని అలవాటు అనాలో స్టైల్ అనాలో ఇంకేమనాలో తెలీదు కానీ హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాల్లో కూడా ఒక కామన్ పాయింట్ పదే పదే రిపిట్ అవుతుంది. దాని పేరు ఊతపదం.

 

 

ఇక ఇప్పటి వరకు అనిల్ రావిపూడి దర్శకుడిగా చేసిన నాలుగు సినిమాలను ఒకసారి పరిశీలిస్తే. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వీటిల్లో కామెడీ బాగుంటుంది. ఆ కామెడీ హైలైట్ కావడానికి ఆయన ఎంచుకున్న అంశం ఊతపదం. పటాస్ సినిమాలో పార్థాయ ప్రతి బోధితాం అంటూ వచ్చే భగవద్గీత కానీ, సుప్రీమ్ సినిమాలో జింగ్ జింగ్ అమేజింగ్ కానీ, రాజా ది గ్రేట్ చిత్రంలో ఇట్స్ లాఫింగ్ టైమ్ కానీ, ఎఫ్ 2 లో అంతేగా అంతేగా లాంటి పదాలు ప్రేక్షకులకి గుర్తుండి పోతాయి. ఇదే మ్యానరిజాన్ని సరిలేరు నీకెవ్వరూ సినిమాలో అనిల్ వాడాడు.

 

 

మరి అన్ని సినిమాలకు ఇది కలిసి వస్తుందని అనుకున్నాడా, లేక ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడా అర్దం కాదు. మొత్తానికి ఎప్పటి లానే ఇందులో కూడా తనకు కలిసొచ్చిన ఊతపదాన్ని ఒకటి సృష్టించి హీరోయిన్ రష్మికతో పలికించాడు. అదే ‘నీకు అర్థమౌతోందా’?? అనేది. ఇకపోతే ఓ అనిలా ఇకనైనా నీ ఫార్ములా చేంజ్ చేసి కాస్త కొత్తగా ఆలోచించవయ్యా అని ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటున్నాడట..

మరింత సమాచారం తెలుసుకోండి: