సంక్రాంతి చలిని చంకలో పెట్టి చుట్టేసెందు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బరిలోకి దిగాడు. ముందే పండగ సీజన్, అందులో చలి ఎంతున్నా లెక్కచేయని ప్రిన్స్ అభిమానులు, ఇంకే ముంది ధియోటర్స్ కు క్యూ కట్టారు. ఇకపోతే సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ దుమ్ముదులపడంలో ‘బేరాల్లేవమ్మా’.. అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో థియేటర్స్‌లో ఎంట్రీ ఇచ్చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు..

 

 

అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఇప్పుడు పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇదిలా ఉండగా దర్శకుడిగా అనీల్ వరుసగా నాలుగు హిట్లు కొట్టగా, హీరోగా మహేష్‌కి రెండు హిట్లు ఉండటంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మూవీ అంటే ప్రేక్షకుల్లో ఒకరకమైన ధీమా ఉంటుంది. అందులోని అనీల్ రావిపూడి సినిమా అంటే ఎంటర్‌‌టైన్మెంట్ పక్కా అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగించాడు.. ఇకపోతే అనిల్ ఒక కొత్త మ్యానరిజంతో ప్రతి సినిమాలో ప్రేక్షకుల మనుసులు దోచేస్తున్నాడు..

 

 

ఇదెలాగంటే  పటాస్ సినిమాలో పార్థాయ ప్రతి బోధితాం అంటూ వచ్చే భగవద్గీత కానీ, సుప్రీమ్ సినిమాలో జింగ్ జింగ్ అమేజింగ్ కానీ, రాజా ది గ్రేట్ చిత్రంలో ఇట్స్ లాఫింగ్ టైమ్ కానీ, ఎఫ్ 2 లో అంతేగా అంతేగా లాంటి పదాలతో మాయ చేశాడు. ఇక ఇప్పుడు ఇదే ఫార్ములాను ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో వాడాడు. అదేమంటే ‘నీకు అర్థమౌతోందా’ అనే డైలాగ్. ఇంతకు ఆ మిగతా నాలుగు సినిమాల డైలాగ్ ఎక్కడి నుండి సాధించాడో తెలియదు గాని. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో వచ్చే డైలాగ్ ‘నీకు అర్థమౌతోందా’ మాత్రం కాపీ కొట్టాడని అనుకుంటున్నారట.

 

 

ఇకపోతే ఇప్పుడు ఇంతగా పాపులర్ అయిన డైలాగ్ ఎక్కడి నుండి అనిల్ తెచ్చాడంటే. ఈ డైలాగ్ ను బిగ్ బాస్‌లో గీతా మాధురి దగ్గర నుండి ఎత్తుకొచ్చిందేనట. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్‌లో 2లో గీతా మాధురి ఫైనల్‌ వరకూ వెళ్లి కౌశల్‌కి విన్నర్ టైటిల్‌ని ఇచ్చేసి.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే హౌస్‌లో ఆమె ఊతపదం ‘నీకు అర్ధమౌతోందా’ మాత్రం బాగా ఫేమస్ అయ్యింది. అక్కడ నుండి ఎత్తిందే ఈ మ్యానరిజం అని అంటున్నారు అసలు విషయాన్ని కనుగొన్న కొందరు సినీ పరిశ్రమ పక్షులు.. ఏది ఏమైనా గీతా మాధురి డైలాగ్ ఇలా వాడుకోవడం ఒక్క అనిల్ కే చెందిందట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: