సారా అలీ ఖాన్ ఇప్పటివరకు నటించింది కేవలం రెండు సినిమాల్లోనే కానీ ఆమె తన ఇంటినుండి బయటకురాగానే ఫోటోగ్రాఫర్స్ ఫోటోలను క్లిక్ మనిపిస్తారంటే.. ఆమెకు ఎంతటి క్రేజ్ ఉందో అర్థంచేసుకోవచ్చు. తన తమ్ముడు తైమూర్ అలీ ఖాన్ వయసు 3ఏళ్ళే అయ్యినప్పటికీ ఆ పిల్లోడికి కూడా కోట్లలోనే అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే, వీళ్ళిద్దరూ ఫోటోలకు పోజ్ ఇవ్వడానికి మాత్రం ఎటువంటి అభ్యంతరం చెప్పారు. సారా అలీ ఖాన్ తన అభిమానులను బాగా ట్రీట్ చేస్తుంది. ఆటోగ్రాఫ్ అడిగినా, సెల్ఫీ అడిగినా వెంటనే ఓకే చెప్పేస్తుంది ఈ యంగ్ భామ.


అయితే, మొన్న ఆమె తన వర్క్ అవుట్ పూర్తిచేసి జిమ్ నుండి బయటకు వస్తుంటే, కొంతమంది అభిమానులను ఆమెను ఆపి కరచాలనం కోసం, సెల్ఫీ ల కోసం అడిగారు. దాంతో, ఆమె వారికి సెల్ఫీ లు ఇస్తూ.. షేక్ హ్యాండ్ లను కూడా ఇస్తుంది. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వమని ఆమెను అడగగా, తాను ఇస్తుంది. దాంతో, ఆ వ్యక్తి ఆమె చేయ్యిపెట్టుకొని గట్టిగాలాగి ముద్దుపెట్టుకుంటాడు. అసలు ఏమవుతుందో అర్థంకాని సారా అలీ ఖాన్ ఒక్కసారిగా స్టన్ అవుతుంది. సదరు వ్యక్తిని ఆమె బాడీగార్డ్ వెంటనే వెళ్ళగొడతాడు కానీ ఇటువంటి షాకింగ్ అనుభవంతో ఆమె చాలా భయపడింది. ప్రస్తుతం ఈ ఘటన కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.


https://mobile.twitter.com/JoinFiroz/status/1215515645183315968

ఇకపోతే, సారా అలీ ఖాన్.. బద్లాపూర్ ఫేమ్ వరుణ్ ధావన్ సరసన కూలీ నం.1 సినిమాలో నటిస్తుంది. అలాగే, సారా.. కార్తీక్ ఆర్యన్ సరసన ఇంతియాజ్ దర్శకత్వంలో ఫిబ్రవరి 14 తెరకెక్కుతున్న మూవీ లో నటించింది. అయితే, ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: