ఒక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ సినిమాకైనా ముందు నుంచి ఒక హైప్ క్రియోటై ఉంటుంది. అందుకు కారణం వాళ్ళ గత చిత్రాల సక్సస్ ఇంపాక్ట్. ఇక సంక్రాంతి బరిలో దిగే సినిమాలకైతే ప్రేక్షకులందరి చూపు సినిమాల మీదే ఉంటుంది. అందుకే పెద్ద స్టార్ హీరోల దగ్గర్నుంచి చిన్న హీరోల వరకు అందరు పండగ సీజన్ ని టార్గెట్ చేసుకొని సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకుంటారు. అలా భారీ అంచనాలు కూడ గట్టుకొని సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో. ఇండియాకంటే ముందుగానే మన స్టార్ హీరోల సినిమాలు ఓవర్సీస్ లో రిలీజవుతుంటాయి. అక్కడ మన స్టార్ హీరోలకి మంచి మార్కెట్ ఉందన్న విషయం అందరికి తెలిసిందే.

 

ముఖ్యంగా అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలకి యూ.ఎస్ లో భారీగా క్రేజ్ ఉంది. అంతేకాదు అక్కడ ఈ స్టార్ హీరోల సినిమాల కోసం విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి మరీ థియోటర్స్ కి వెళతారు. అలానే ఇక్కడ కంటే ముందుగా అల ఓవర్సీస్ లో రిలీజైంది. అల్లు అర్జున్ త్రివిక్రం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా అల కోసం ముందుగానే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళారట. ఎంతో ఆశగా వెళ్ళిన జన్నాలకి అసలు సినిమా ఏంటో అంతు చిక్కలేదని తెలుస్తోంది. బన్నీ త్రివిక్రం కాంబినేషన్ మీద ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన ఆడియన్స్ కి సినిమా ఏంటో ఆదిలోనే అర్థమై ఇంకేముంది సినిమాలో అనుకున్నారట.

 

సీనియర్ నటి టబు, జయరాం, నివేదా పేతురాజ్, సుశాంత్, రాజేంద్ర ప్రసాద్ ఇలా భారీ తారాగణం ఉన్నాగాని వీళ్ళ పాత్రలేమిటో అన్న అనుమానం కలుగుతుందట. ముందు నుంచి అల కాపీ అన్న అపవాదు ని నిజం చేసిందని అంటున్నారు. ఇంటి గుట్టు అనే సినిమాతో పాటు మరో పరభాషా సినిమా కథ కి కాపీలా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రొటీన్ కామెడి, త్రివిక్రం మార్క్ పంచ్ లే గానీ అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదని అంటున్నారు. అంతేకాదు కొన్ని సీన్స్ చూస్తుంటే త్రివిక్రం గతంలో తీసిన అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలోని సీన్స్ ని అంతక ముందు తీసిన సీన్స్ ని కాపీ పేస్ట్ చేశాడన్న టాక్ కూడా వస్తోంది. మొత్తంగా చూస్తే బన్నీ పర్‌ఫార్‌మెన్స్ తోనే సినిమాని లాక్కొచ్చాడని ..ఈ సినిమాని గట్టించగలిగేది ఆయనేనని అభిమానులే చెప్పుకుంటున్నారట. ఇక ఈ మాత్రం పాజిటివ్ టాక్ రావడానికి కారణం బన్నీ తో పాటు థమన్ కంపోజ్ చేసిన సామజవరగమన, రాములో రాములా, బుట్ట బొమ్మ ...ఈ మూడే సినిమాలో హైలెట్ అని అంటున్నారు. మరి ఇక్కడ మన జనాలకి ఇక ఏ రకంగా నచ్చుతుందో చూడాలి.    
  

మరింత సమాచారం తెలుసుకోండి: